Begin typing your search above and press return to search.
నరం లేని నాలుకకు కేరాఫ్ అడ్రస్ పీకే.. అదెలానంటే?
By: Tupaki Desk | 17 Dec 2021 3:22 AM GMTప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. రాజకీయ ఎత్తుగడలు.. వాటికి మించిన ఎన్నికల వ్యూహాలతో అధికారాన్ని ఇట్టే ఒడిసిపట్టి.. తాను పని చేసి పెడుతున్న పార్టీని అధికారపక్షంగా అవతరించేలా చేయటంలో ఆయనకున్న టాలెంట్ ఎంతన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చేసి చూపించారు.
అలాంటి ఆయన.. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే తన లక్ష్యమని వ్యాఖ్యానిస్తూనే.. అంతలోనే ఆ పార్టీతో పొసగక బయటకు రావటం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ మీద నెగిటివ్ వ్యాఖ్యలు చేసిన పీకే.. తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా వార్తల్లోకి వచ్చారు.
రాజకీయ పార్టీలకు పని చేసే పీకేలో.. ఒక మంచి గుణం ఉంది. ఏ అంశం మీద ఆయన నిలకడగా తన అభిప్రాయాన్ని చెప్పరు. ఎప్పటికప్పుడు మాట మార్చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. మొన్నటికి మొన్న రాహుల్ మీద విమర్శలు చేసిన ఆయన.. తాజాగా తన మాటను మార్చేశారు. రాహుల్ నాయకత్వంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు. రాహుల్ కు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానాలు ఇచ్చారు. ఏ మాట మీదా నిలకడగా ఉండనన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.
కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో ఒక విపక్ష కూటమిని ఏర్పాటు చేయటం కష్టమని.. దాని మనుగడ అంత తేలిక కాదని స్పష్టం చేశారు. ఇందుకు పూర్తి భిన్నమైన వ్యాఖ్యను గతంలో చేశారు. అప్పట్లో ఆయన నోటినుంచి వచ్చిన మాటేమంటే.. కాంగ్రెస్ లేకున్నా.. కేంద్రంలో విపక్ష కూటమి సాధ్యమేనంటూ వ్యాఖ్యానించారు.
గతంలో తాను చెప్పే మాటలకు.. వర్తమానంలో చేసే వ్యాఖ్యలకు పొంతన లేకుండా మాట్లాడటం పీకేకు అలవాటే. దాన్ని మరోసారి ఆయన నిరూపించారు. కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం తక్కువగా ఉన్నట్లుగా చెప్పిన పీకే.. పార్టీలను కూడగట్టుకోవటంతో బీజేపీపై గెలుపు సాధ్యమనుకోవటం సరికాదన్నారు.
మోడీని ఓడించేందుకు బలమైన నాయకత్వం.. గట్టి సందేశం అవసరమన్న ఆయన.. హిందుత్వ అంశాన్ని ప్రస్తావించటం అనవసరమన్నారు. ఇటీవల రాహుల్ చేసిన హిందుత్వ వ్యాఖ్యలు అవసరం లేదన్నది ఆయన వాదన.
రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తూ.. ఎన్నికల్లో వారి గెలుపునకు ఎత్తులు వేసే ప్రశాంత్ కిశోర్ గతంలో నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీలో చేరటం.. ఆ తర్వాత తెగతెంపులు చేసుకోవటం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో మళ్లీ ఎవరితో కలిసి పని చేయాలని మీరు భావిస్తున్నారన్న ప్రశ్నకు నితీశ్ అంటూ పీకే తన మనసులోని మాటను చెప్పారు. నితీశ్ తో మాట్లాడతారా? అంటే.. మాట్లాడుకుంటామని చెప్పారు.
అదే సమయంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో పని చేస్తారా? అని ప్రశ్నిస్తే.. ఆయనతో పని చేయటం నచ్చదని తేల్చేశారు. యూపీ ఎన్నికల్లో 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే కాంగ్రెస్ కు మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏ ప్రశ్నకు అయినా ఇట్టే సమాధానం ఇచ్చే పీకే.. దేశంలో అత్యుత్తమ నాయకుడు ఎవరన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వకపోవటం గమనార్హం.
దేశ ప్రధానిగా రాహుల్ అవుతారా? అన్న ప్రశ్నకు ఆయన అవుతారని బదులిచ్చారు. సమయానికి తగ్గట్లుగా వ్యాఖ్యలు చేయటం అలవాటైన పీకే.. రేపొద్దున ఇప్పుడు చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వ్యాఖ్యలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏమైనా నరం లేని నాలుకకు కేరాఫ్ అడ్రస్ పీకే అన్నట్లుగా ఆయన తీరు ఉంటుందనటంలో సందేహం లేదు.