Begin typing your search above and press return to search.

పీకేకు దీదీ గిఫ్ట్..నేరుగా రాజ్యసభలోకే ఎంట్రీ

By:  Tupaki Desk   |   1 March 2020 1:32 PM GMT
పీకేకు దీదీ గిఫ్ట్..నేరుగా రాజ్యసభలోకే ఎంట్రీ
X
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... అక్కడ ఖచ్చితంగా వినిపించే పేరు ప్రశాంత్ కిశోర్ దే. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీతో పాటు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగనఖ్ మోహన్ రెడ్డికి స్టన్నింగ్ విక్టరీ దక్కే వ్యూహాలను రచించి దేశంలోనే తనను మించిన ఎన్నికల వ్యూహకర్త లేడని ప్రశాంత్ కిశోర్ నిరూపించుకున్నారు. ఎంతైనా ఎన్నికల వ్యూహకర్తకు.. వ్యూహాలు పన్నడం మాత్రమే తెలుసు గానీ... ప్రత్యక్ష రణ క్షేత్రంలోకి దిగి పోరాడటం చేతకాదు కదా. పీకే విషయంలోనూ ఇదే జరిగింది. ఎందరికో రికార్డు విక్టరీలు అందించిన పీకేకు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుదామన్న దమ్మూ ధైర్మం లేవని తేలిపోయింది. పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభల్లోకి అడుగుపెట్టేందుకు ఆయన దాదాపుగా మార్గం సుగమం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో పెద్దల సభగా పేరుపడిపోయిన రాజ్యసభలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పీకే దాదాపుగా నిర్ణయం తీసుకున్నారట.

అయినా మొన్నటికి మొన్న పీకే రాజకీయ అరంగేట్రం చేసిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఆయనను గెంటేసింది కదా. మరి ఏ పార్టీ టికెట్ పై పీకే రాజ్యసభలోకి ఎంట్రీ ఇస్తారనే కదా మీ డౌటు? పీకే సరే అనాలి గానీ... ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి బీజేపీ సహా దేశంలోని చాలా పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో ఎన్నికల సమరాంగణంలోకి దూకేందుకు సిద్ధమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పీకేకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు రెడీ అయిపోయారట. బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తృణమూల్ కు పీకే ఎన్నికల వ్యూహాలను రచించనున్నాడట. ఈ క్రమంలో తన పార్టీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఓ సీటును పీకేకు ఇచ్చేందుకు దీదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇదిలా ఉంటే... ఎన్నికల వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరుగాంచిన పీకేకు ప్రత్యక్ష రాజకీయాలు అంతగా కలిసి రాలేదు. తాను అడుగుపెట్టిన తొలి రాజకీయ పార్టీ జేడీయూ ఆయనను ఏకంగా బయటకు గెంటేసింది. తన సొంత రాష్ట్రం బీహార్ పై పీకే ప్రేమ ఒలకబోయగానే.. ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ పొంగిపోయి... పీకేను తన నేతృత్వంలోని జేడీయూలోకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అయితే ఏ నోటితో అయితే పీకేకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారో... అదే నోటీతో పీకే బహిష్కరిస్టున్నట్లుగా నితీశ్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు పీకే వ్యవహార సరళే కారణమని కూడా చెప్పక తప్పదు. జేడీయూలో ఉంటూ ఆ పార్టి మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించడం సరికాదు కదా. మొత్తంగా ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరున్న పీకే... తనకు ప్రత్యక్ష ఎన్నికలు సరిపడవని ఓ నిర్ధారణకు వచ్చాకే.. తృణమూల్ ఆఫర్ చేసిన రాజ్యసభ సీటునుఅంగీకరించినట్లుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.