Begin typing your search above and press return to search.
ఎలక్షన్ సీక్రెట్స్ చెప్పిన ప్రశాంత్ కిషోర్
By: Tupaki Desk | 12 Nov 2018 1:11 PM GMTప్రశాంత్ కిషోర్... రోజూ వార్తా పేపర్లు చదివే వారికి ఈ పేరు సుపరిచితం. ఎలక్షన్లలో గెలవడం అనే ఒక ప్రహసనాన్ని మరింత డెప్త్ గా వెళ్లి సింప్లిఫై చేసిన వ్యక్తి ఆయన. దశాబ్ద కాలంగా పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాను ఎన్నికల్లో అత్యంత కీలకంగా మార్చేశారు. దాని వాడకంలో ఆయన కొత్త అవకాశాలను కనిపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నికల ప్లానింగ్ గురించి కొన్ని రహస్యాలు చెప్పారు.
ఆయన చెప్పిన అతిముఖ్యమైన పాయింట్లు
*. ఎన్నికలపై ముందుగా వేసే అంచనాలన్నీ అసంపూర్ణమే.
* చివరి 10 నుంచి 12 రోజులే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే సమయం.
* పేదలు ఎవరికి ఓటు వేస్తారో చెప్పలేమన్నారు.
* 2014లో నాలుగు కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉంటే ఇప్పుడు 40 కోట్లు ఉన్నాయి. వాటి ప్రభావం ఎక్కువ.
* దేశంలో 70 శాతం ప్రజల దినసరి ఆదాయం రూ.100 కూడా లేదు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు. వారి ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయం.
* పేదలు ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తారు. అందుకే దేశంలో ప్రతీ ఎన్నికలూ నాయకులకు షాక్ ఇస్తుంటాయి
* ‘‘సోషల్ మీడియాలో నూతనత్వం పోయింది.
* ఓటర్లలో సగం మంది సోషల్ మీడియాలో ఉన్నారు.
* భారీ ర్యాలీలు తీసేవాడి కన్నా భారీ సంఖ్యలో 30 సెకన్ల వీడియోలు తీసేవాడు త్వరగా ప్రజలకు చేరువ అవుతాడు
* ఎంత ప్రచారమైనా సోషల్ మీడియాలో చేసుకోవచ్చు.