Begin typing your search above and press return to search.
మోడీ లాక్ డౌన్ మీద పీకే మార్క్ పంచ్
By: Tupaki Desk | 26 March 2020 6:10 AM GMTకరోనాను కంట్రోలో చేయటానికి యావత్ దేశాన్ని ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడున్న అపత్కాల పరిస్థితుల్లో విమర్శలు.. పొగడ్తల కంటే కూడా.. ఉమ్మడిగా పోరు సాగించాల్సిన అవసరం ఉంది. కానీ.. భారత్ లాంటి దేశంలో అలాంటివి ఆశించటం అత్యాశే అవుతుంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) రియాక్ట్ అయ్యారు.
మోడీ ప్రకటించిన ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ నిర్ణయం మంచిదే కానీ.. ఇరవై ఒక్కరోజులు అన్నది చాలా ఎక్కువ సమయంగా అభివర్ణించారు. అసలు.. ఇలాంటి పరిస్థితి వరకూ ఎందుకు వచ్చిందన్నది చాలా ముఖ్యమన్నారు. కరోనా కారణంగా చోటు చేసుకునే విపరిణామాల్ని అంచనా వేయటంలో చోటు చేసుకున్న వైఫల్యమే.. ఇప్పుడీ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ఇంత దీర్ఘకాలం పాటు లాక్ డౌన్ కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్నారు.
లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సరిగా లేవని.. పేదల గురించి పట్టించుకున్నట్లుగా లేదని ఆయన పేర్కొన్నారు. కరోనాపై జరిపే పోరాటానికి సంబంధించి పక్కా ప్లాన్ లోపించిందని..ఈ కారణంతో రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. మంచికో చెడుకో కానీ.. ప్రశాంత్ కిశోర్ లాంటి వారు ఎత్తి చూపే అంశాల్ని ప్రభుత్వం నోట్ చేసుకొని.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.