Begin typing your search above and press return to search.

ప్రధానిగా రాహుల్... అంతా ఆయన చేతుల్లోనే...?

By:  Tupaki Desk   |   17 Dec 2021 9:30 AM GMT
ప్రధానిగా రాహుల్... అంతా ఆయన చేతుల్లోనే...?
X
రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అవరా అన్నది ఎవరు చెప్పాలి. అసలు ఈ దేశంలో ప్రధానులు అయినా ముఖ్యమంత్రులు అయినా ఎవరు ఉండాలి అన్నది నిర్ణయించేది ఎవరు. దీనికి సమాధానం చాలా సులువు. ఓటర్లు కోట్లాదిగా ఓట్లెత్తితేనే ఎవరికైనా ఆ అత్యున్నత పీఠం దక్కేది. కానీ మధ్యలో కొందరు మాత్రం ఫలానా వారు ప్రధాని అవరు అంటారు, నేను తలచుకుంటే ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కదు అంటూ సవాళ్ళు చేస్తూంటారు.

అయితే విజ్ఞత కలిగిన ఓటర్లు మాత్రం ఎపుడూ తన నిర్ణయాన్ని కచ్చితంగానే ప్రకటిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే తాజాగా ఎన్నికల వ్యూహకర్త కమ్ పొలిటీషియన్ ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీ విషయంలో వరసబెట్టి చేస్తున్న కామెంట్స్ చూసి మాత్రమే. ఆ మధ్యన ఆయన ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్ కి ప్రధాని అయ్యే అవకాశం లేనే లేదని తేల్చేశారు.

రాహుల్ ప్రధాని కాలేడని కూడా చాలా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలాగే కాంగ్రెస్ మీద కూడా ఘాటు కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గత పాతికేళ్ళుగా ఎపుడూ సొంతంగా గెలవలేదని, అంతే కాకుండా ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది అని కూడా పీకే సెలవిచ్చారు. ముందు కాలమంతా ప్రాంతీయ పార్టీలు ఇతర కూటములదే అని కూడా తేల్చేశారు.

దాని మీద కాంగ్రెస్ నుంచి చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చిపడ్డాయి. మరి దాని మహిమో ఇంకేమో తెలియదు, లేకపోతే ప్రశాంత్ కిశోర్ లోని వ్యూహకర్తకు తత్వం బోధపడి ఫ్యూచర్ అర్ధమైందో ఏమో కానీ రాహుల్ ప్రధాని అవుతారు అంటూ మళ్లీ స్టాడ్ మార్చేశారు. రాహుల్ కేమి, భేషూగ్గ్గా ప్రధాని పదవిని అధిష్టించగలరు అంటూ ఆయన బాగానే సౌండ్ చేస్తున్నారిపుడు.

మరి ఇంతలోనే ఇంత మార్పు రావడంలోని పరమార్ధం ఏంటి ప్రశాంత్ కిశోరా అంటే ఆయనలోని వ్యూహకర్త ఏమని చెబుతాడో తెలియదు కానీ మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చి దూకుడు చేద్దామనుకుంటున్న పీకేకి పాలిటిక్స్ బాగానే వంటబడుతోంది అనుకోవాలేమో.

ఇక ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి ఎపుడూ రాలేవని, వెనక బలమైన కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండాల్సిందే అంటూ ప్రశాంత్ కిశోర్ చెబుతున్న మాటలు కూడా విశేషమైనవే. మొత్తానికి కాంగ్రెస్ బలమేంటో అర్జంటుగా ప్రశాంత్ కిశోర్ కి తెలిసిందా లేక ఆయనకు 2024లో జరిగే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అవుతారని కల వచ్చిందా తెలియదు, మొత్తానికి రాహుల్ తో పాటు ఆయన పరివారం మెచ్చే మాటలు ముచ్చటగానే చెప్పారు.

అయినా ఒక్క మాట. ఇలా తరచూ మాటలు మారుస్తూ పోతే పీకే ఫక్తు పొలిటీషియన్ అవుతారేమో కానీ ఆయన ఎన్నికల సర్వేలు, వ్యూహాలు మాత్రం పక్కాగా దెబ్బ తినిపోవడం ఖాయమనే అంటున్నారు. అయినా వ్యూహకర్త ఉద్యోగాన్ని తన శిష్యులకు ఏనాడో అప్పగించేసిన పీకే ఇక ముందు ముందు కనిపించేది పొలిటీషియన్ అవతారంలోనే అనుకోవచ్చేమో. సో అలా సక్సెస్ ఫుల్ గా రాణించడానికి ఆయన తరచూ ఇలా ఒపీనియన్స్ ని చేంజ్ చేస్తున్నాడు అనుకోవాలేమో.