Begin typing your search above and press return to search.

ఈ మీటింగ్ మంచాలు దొంగ‌త‌నం కాలేదు

By:  Tupaki Desk   |   10 Sep 2016 10:38 AM GMT
ఈ మీటింగ్ మంచాలు దొంగ‌త‌నం కాలేదు
X
ఉత్తరప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఎనిమిది నెలల ముందే ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ 'ఖాత్ పే చర్చా' (మంచాలపై చర్చ) పేరిట రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సభను నిర్వహించిన వేళ - అక్కడికి వచ్చిన వారంతా కూర్చునేందుకు ఏర్పాటు చేసిన 2 వేల మంచాలను ఎత్తుకువెళ్లగా - రాహుల్ ప్రసంగం కన్నా - మంచాలను ఎత్తుకు వెళ్లిన కార్యకర్తలు - రైతుల గురించిన వార్తకే మీడియాలో ప్రాధాన్యం దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం ఒకింత అసహనానికి గురి కాగా, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్వయంగా రంగంలోకి దిగారు.

యూపీలోని ఖలీలాబాద్‌ లో ఇదే తరహా మంచాల సభ జరగగా - ఒక్కరు కూడా మంచాలను తీసుకువెళ్లలేదు. మంచాలు తీసుకువెళ్లాలన్న ఆలోచనతో వచ్చిన వారు కూడా వాటిని తాకలేదు. సభకు వచ్చిన వారు మంచాల జోలికి పోకుండా ప్రశాంత్ కిశోర్ పెద్ద మంత్రాంగాన్నే నడిపినట్టు తెలుస్తోంది. రెండో సభకు ఐపీఏసీ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యకర్తలను రంగంలోకి దించిన ఆయన ఎవరూ మంచాలను తరలించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగారు. మొత్తం 20 మందికి పైగా నల్ల టీ షర్టులు ధరించిన యువతీ యువకులు సభలోనే ఉండి తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రశాంత్‌ కు పంపుతూ - ఆయన సలహా - సూచనల మేరకు - సభ ముగియగానే ప్రజలు ప్రశాంతంగా వెళ్లి పోయేలా చూశారు.