Begin typing your search above and press return to search.

NRC పై రాహుల్ కి సలహా ఇచ్చిన పీకే!

By:  Tupaki Desk   |   25 Dec 2019 6:08 AM GMT
NRC పై రాహుల్ కి సలహా ఇచ్చిన పీకే!
X
ప్రస్తుతం దేశంలో ఎన్ ఆర్ సి పై రోజురోజుకి ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) - నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ ఆర్‌ సి) లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారు. అలాగే ఈ బిల్లులకి మేము వ్యతిరేకం అంటూ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. పలు ప్రాంతాలలో ఆందోళన కారులు దాడులకు దిగుతున్నారు. దీనితో ఈ ఆందోళన లోకి మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరిగిపోతుంది.

తాజాగా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన నేషనల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు - రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ధన్యవాదాలు తెలిపాడు. ఇదే సమయంలో పార్టీలోని సీనియర్ సభ్యులతో కమ్యూనికేట్ చేయాలని - కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్‌ ఆర్‌ సి అమలు ఉండదని బహిరంగంగా ప్రకటించాలని ఆయన కాంగ్రెస్ నాయకుడిని కోరారు. సిఎఎ - ఎన్‌ ఆర్‌ సి లకు వ్యతిరేకంగా పౌరుల ఉద్యమంలో చేరినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్‌ ఆర్‌ సి ఉండదని అధికారికంగా ప్రకటించడంపై మీరు కాంగ్రెస్‌ వర్గీయులను ఆకట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము అని ప్రశాంత్ కిషోర్ మంగళవారం ట్వీట్ చేశారు.

సిఎఎ మరియు ఎన్‌ ఆర్‌ సి రెండింటికి వ్యతిరేకంగా ఉద్యమించిన కిషోర్, ఎన్‌ ఆర్‌ సి అమలును నిలిపివేయడానికి కొన్ని మార్గాలను కూడా పంచుకున్నారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఎన్‌ ఆర్‌ సికి నో చెప్పాలని ఆయన సూచించిన మార్గాలలో ఒకటి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న యువత - విద్యార్థులకు సోనియా గాంధీ - మన్మోహన్ సింగ్ - ప్రియాంక గాంధీ - రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు.

నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ - రాహుల్ గాంధీ “ఈ దేశానికి ఒక స్వరం ఉంది - ఆ స్వరం వెనకడుగు వేయకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రేమతో - శాంతితో పోరాడింది. ఆ స్వరం లేకుండా దేశం ఉనికిలో ఉండదు. దేశంలోని శత్రువులు ఆ గొంతును అణచివేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు, వారు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు, కాని ప్రజలు వారికి వ్యతిరేకంగా పోరాడారు” అని తెలిపారు.