Begin typing your search above and press return to search.

ఇక ఆ 16 మంది ముఖ్య మంత్రులదే భాద్యత !

By:  Tupaki Desk   |   13 Dec 2019 9:36 AM GMT
ఇక ఆ 16 మంది ముఖ్య మంత్రులదే భాద్యత !
X
వరుసగా రెండోసారి కూడా కేంద్రం లో అధికారం చేపట్టిన బీజేపీ ..వచ్చిన ఆరునెలల కాలంలోనే ఎన్నో సంచలనమైన నిర్ణయాల తో అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు ని పార్లమెంట్ లో ఆమోదింపజేసి ..చట్టంగా మార్చిన విషయం తెలిసిందే. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఇప్పటికే బిల్లు పార్లమెంట్ , రాష్ట్రపతి వద్ద ఆమోదం పొంది చట్టంగా మారడం తో దీని ఆపేందుకు చివరి ప్రయత్నం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని, ‘‘భారత ఆత్మను కాపాడండి’’ అంటూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ట్విటర్ వేదికగా ఆయన ఇవాళ స్పందిస్తూ.. ‘‘పార్లమెంటులో మెజారిటీ గెలిచింది. ఇక ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధికి ఆవల... భారత ఆత్మను కాపాడే బృహత్తర బాధ్యత ఈ చట్టాల్ని అమల్లోకి తెచ్చే 16 మంది బీజేపీయేతర ముఖ్యమంత్రుల దే. ఇప్పటికే పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల కు చెందిన ముగ్గురు సీఎంలు క్యాబ్‌కు, ఎన్నార్సీకి నో చెప్పారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా తమ వైఖరి వెల్లడించే సమయం ఆసన్నమైంది.. అని అయన తెలిపాడు.

అలాగే సోమవారం లోక్‌సభ లో తమ పార్టీ క్యాబ్‌ కు మద్దతు తెలపడంపై పీకీ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసారు. మత ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపించే విధంగా ఉండే ఈ బిల్లు కు మద్దతు ఇవాల్సిన అవసరం ఏమిటని ఆయన జేడీయూని ప్రశ్నించారు. సెక్యులరిజం, గాంధీ సిద్ధాంతాలతో నడుస్తామని చెప్పి పార్టీ రాజ్యాంగంలో రాసుకుని... ఇలాంటి బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఆ సిద్దాంతాలకు అర్థం ఏముంటుంది అని అన్నారు.