Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ తో జత కట్టిన పీకే !

By:  Tupaki Desk   |   14 Dec 2019 7:28 AM GMT
కేజ్రీవాల్ తో జత కట్టిన పీకే !
X
ప్రస్తుత రాజకీయాల పై సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వాడకం లో పీకే టీం ఇండియా లో టాప్ లో దూసుకుపోతుంది. దీనితో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు దేశంలో మారుమ్రోగి పోతుంది. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్త గా వ్యవహరించి వెలుగు లోకి వచ్చిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ . ఆ ఎన్నికలలో మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి మోడీని అధికారం లో కూర్చోబెట్టారు.

ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో జెడియు కు పనిచేశారు. అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించారు. అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక తాజాగా 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైకాపా తరపున ప్రచారం నిర్ణయించారు. ఏపీలో కూడా ఏపీ చరిత్ర లో ఏ పార్టీ కూడా గెలవలేనటువంటి అత్యధికమైన స్థానాలలో వైసీపీ విజయం సాధించి ..అధికారంలోకి వచ్చింది. దీనితో దేశంలో ని అన్ని పార్టీలు కూడా ఆయన సేవలను ఉపయోగించుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్నాయి.

దీనితో తాజాగా ఢిల్లీ సీఎం క్రేజీవాల్ పీకే టీం తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఢిల్లీ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ..ఈ నేపథ్యంలో ఐ-పీఏసి తో ఆప్‌ కలిసి పనిచేయనున్నట్టు ట్విటర్‌ ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఐపాక్‌ కూడా తన ట్వీట్‌ ద్వారా ధృవీకరించింది. పంజాబ్‌ ఎన్నికల తరువాత గట్టి పోటీదారుగా ఆప్‌ను గుర్తించామని, ఈ నేపథ్యంలో ఆప్‌తో కలిసి పనిచేయనుండడం సంతోషకరమని ఐపాక్‌ తెలిపింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాగా వేసిన బీజేపీ , ఢిల్లీ లో కూడా అధికార పగ్గాలకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణం లో బీజేపీ షాకిచ్చేలా కేజ్రీవాల్‌ ఈ కీలక అడుగు వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా తనదైన శైలిలో రాణిస్తూ ఆయా పార్టీలకు అధికారాన్ని సునాయాసంగా అందిస్తున్న పీకే వ్యూహాలు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి.