Begin typing your search above and press return to search.
ఏపీలో ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ ఎలక్షన్... నంద్యాల
By: Tupaki Desk | 30 Jun 2017 8:29 AM GMTనంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ పెద్ద స్కెచ్చే గీస్తోంది. టీడీపీలో ఉన్న లుకలుకలను క్యాష్ చేసుకుంటూ ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డిని గెలిపించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. అందుకే జగన్ 2019 ఎన్నికల కోసం ఆయన్ను హైర్ చేసుకున్నారు. అందుకోసం ప్రశాంత్ టీం ఇప్పటికే జిల్లాల వారీగా ప్రజల పల్స్‌పై గ్రౌండ్ రిపోర్ట్ కూడా సిద్దం చేసిందట. ఎక్కడ వైసీపి బలం వుంది. ఎక్కడెక్కడ ఎలా బలం పెంచుకోవాలి.. గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అవసరమనే అంశాలపై నియోజవర్గాల వారీగా పకడ్బందీ ప్లాన్ ను సిద్దం చేశారట ప్రశాంత్ కిషోర్ . అంతేకాదు... 2019కి ముందే తన ప్లానింగ్ ఎలా పనిచేస్తుందో శాంపిల్ చూపించడానికి నంద్యాల ఉప ఎన్నిక బాధ్యత కూడా ఆయనే భుజాన వేసుకున్నారని టాక్.
నంద్యాల ఉప ఎన్నికలలో టిక్కెట్ ఎవ్వరికి ఇవ్వాలో జగన్ ముందే కొందరికి మాట ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే.. ప్రశాంత్ సూచనలతో శిల్పాకు ఖరారు చేశారట. నంద్యాల నియోజవర్గంలో జనాబాపై దృష్టిసారించిన ప్రశాంత్ కిషోర్ .. అక్కడ ముస్లిములు 50వేలు - రెడ్లు 30 వేలు - బీసీలు 45 వేలు - దళితులు 20వేలు - కాపులు బలిజలు 25వేలు అని గుర్తించారట. దీని ప్రకారం ఏం చేయాలనే ప్లాను ఇప్పటికే ప్రశాంత్ రూపొందించారని టాక్. మొత్తానికి గెలుపోటముల మాటెలా ఉన్నా ప్రశాంత్ కిశోర్ కు ఏపీలో ఇదే తొలి ఎన్నిక అన్నది మాత్రం వాస్తవం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/