Begin typing your search above and press return to search.
గెలిచే చోటికి వెళ్ళడేమో ప్రశాంత్ కిషోర్!
By: Tupaki Desk | 3 Jun 2020 9:30 AM GMTకాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ షాకిచ్చాడు. త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరగా తిరస్కరించారు. జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితిలో గట్టెక్కేందుకు కాంగ్రెస్ పీకేను ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని మాజీ సీఎం కమల్‌నాథ్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారని తెలిపారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరినట్లు వెల్లడించారు. నేను దానికి అంగీకరించలేదని.. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ కోసం పని చేయలేనని స్పష్టంగా చెప్పానని వివరించారు.2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్ కిశోర్ నరేంద్రమోదీ కోసం పని చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా బీజేపీకి దూరమయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే నాయకుడు స్టాలిన్ కోసం పని చేస్తున్నారు.