Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌లో ఆయన స్థానంపై కన్నేసిన పీకే.. ఏం జరగనుంది?
By: Tupaki Desk | 21 April 2022 1:30 PM GMTఅహ్మద్ పటేల్... దేశ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఈ పేరు పరిచయం అవసరం లేనంతగా ఈ కాంగ్రెస్ దివంగత నేత సుపరిచితుడు. కాంగ్రెస్ పార్టీ రథసారథి సోనియా గాంధీకి ఆంతరంగికుడు. సోనియాకి రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉంటూ.. వెనకుండి పార్టీని నడిపించారు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా దివంగత అహ్మద్ పటేల్ కు మంచి పేరుంది. ఒక్క లైన్లో చెప్పాలంటే పార్టీకి సంకట్ మోచన్‌గా పేరు గడించారు. కరోనా కారణంగా ఆయన 2020 లో కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన తర్వాత ఆ స్థానం ఎవరి సొంతం కాలేదు. దీనిపై రాజకీయ వ్యూహకర్త పీకే కన్నుపడిందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా పని చేసిన అహ్మద్ పటేల్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా ఉన్న సమయంలో పార్టీలో శక్తిమంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. మొత్తంగా మూడు సార్లు లోక్ సభకు, ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 1986లో ఆయన గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు.
1988లో గాంధీ-నెహ్రు కుటుంబానికి జవహర్ భవన్ ట్రస్ట్ బాధ్యతలు సైతం చేపట్టాడు. రాజీవ్ గాంధీతో ఎంత సన్నిహితులుగా ఉన్నారో ఆ తరువాత కాలంలో సోనియా గాంధీకి కూడా అంతే సన్నిహితంగా మెలిగారాయన. పటేల్ మరణంతో ఆయన లేని లోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందన్న వాదన ఉంది. ఈ క్రమంలో మరణించిన అహ్మద్ పటేల్ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్ ఆశిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.
అహ్మద్ పటేల్ స్థానంపై పీకే కన్ను వేయడం వెనుక ఆయన లెక్కలు ఆయనకున్నట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ వద్ద అంతటి సాన్నిహిత్యం తేలికగా లభించదనేది టాక్. చాలా మంది సీనియర్లకే టెన్ జన్ పథ్ గేట్లు తెరుచుకోని పరిస్థితి. అలాంటిది బయటి వ్యక్తి అయిన ప్రశాంత్ కిశోర్‌పై ఆ పార్టీ అధిష్టానం గంపెడాశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తనకు అహ్మద్ పటేల్ స్థానం కావాలని పీకే ప్రయత్నిస్తున్నట్లు టాక్. మరి దీనికి కాంగ్రెస్ పెద్దలు ఎలా రెస్పాండ్ అవుతారో.