Begin typing your search above and press return to search.

'పీకే' అరంగేట్రానికి ముహూర్తం ఖరారు?

By:  Tupaki Desk   |   22 April 2022 3:30 PM GMT
పీకే అరంగేట్రానికి ముహూర్తం ఖరారు?
X
కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదువుతోంది. దీని కోసం నాయకత్వ మార్పునకు సైతం సిద్ధమవుతోంది. దేశంలో నానాటికీ తగ్గిపోతున్న ప్రతిష్టను ఇనుమడింపచేయాలని ఉవ్విళ్లూరుతోంది.

దీనికి గాను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీ నాయకుడిగా ఉంచేందుకు కూడా రెడీ అవుతోంది. ఈ మేరకు నిర్ణయాలు కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై సీనియర్లు మాత్రం పీకే రాకను ఆక్షిపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే నష్టపోయిన పార్టీని బలోపేతం చేయాలంటే పీకే లాంటి వారి అవసరం అవసరమని అధినేత్రి సోనియా గాంధీ గుర్తించారు. అందుకే పీకే రాకకోసం చూస్తున్నారు.

మే 7న పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని అందరు భావిస్తున్నారు. ఆశగా ఎదురుచూస్తున్నారు భవిష్యత్ మనదే అనే ధీమాతో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనికొస్తాయని ఆశిస్తున్నారు దేశంలోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని మరిచిపోయినట్లు తెలుస్తోంది.

అందుకే వచ్చే ఎన్నికల్లో పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తిస్తున్నారు దీనికి గాను సోనియాగాందీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నిరాష్ట్రాట్లోనూ సమర్థులైన నాయకుల కోసం ఆరా తీస్తున్నారు గెలుపు గుర్రాలకు పెద్ద పీట వేయాలని తాపత్రయపడుతున్నారు.

ఇప్పటికే పీకే కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం బలోపేతం కావాలంటే కొన్ని త్యాగాలు చేయకతప్పదని చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీని పట్టుకుని ఉన్న సీనియర్లు ఇప్పుడు పీకే రాకను వద్దని వారిస్తున్నారు కానీ సోనియా మాత్రం ససేమిరా అంటున్నారు పీకే రావాల్సిందేనని పట్టు బడుతున్నారు.దీతో పీకే రాక కచ్చితమేనని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి కొండంత అండగా పీకే నిలుస్తారని సోనియా విశ్వాసం. అందుకే ఆయన రాకపై ఎవరెన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స

పార్టీలో నాయకత్వ మార్పుపై కూడా పలు సలహాలు ఇచ్చారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ ఉండాలని సూచిస్తున్నారు. పార్టీ అద్యక్షులుగా గాంధీయేతర వ్యక్తి కావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో పీకే సూచించిన సలహాలు, సూచనలు తూచ తప్పకుండా పాటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలో కూర్చోబెట్టేందుకు పీకే పక్కాగా ప్రణాళికలు రచిస్తారని నమ్ముతున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో పీకేు అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు సాధించేందుకు పీకే అస్త్రాలు సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో జగన్ తో పొత్తు పెట్టుకుంటామని చెబుతూనే తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోటీలో దిగుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. పీకే రచించిన వ్యూహాలు కాంగ్రెస్ పార్టీని గాడిలో పడేస్తాయా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.