Begin typing your search above and press return to search.

పొమ్మంటార‌ని తెలిసి.. త‌నే పోయాడా..? కాంగ్రెస్ విష‌యంలో పీకే వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   26 April 2022 3:31 PM GMT
పొమ్మంటార‌ని తెలిసి.. త‌నే పోయాడా..?  కాంగ్రెస్ విష‌యంలో పీకే వ్యూహం ఇదేనా?
X
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరేది లేద‌ని.. సాధికారిత బృందంలో భాగం కావడం సహా ఎన్నికల బాధ్యత తీసుకునేందుకు కాంగ్రెస్‌లో చేరాలన్న ప్రతిపాదనను తిరస్కరించాన‌ని.. తాజాగా ప్ర‌క‌టించి.. పార్టీకి గుడ్ బై చెబుతున్న ట్టు ట్వీట్ చేశారు. అయితే.. పీకే వ్యూహాత్మ‌కంగానే ఇలా చేశార‌ని.. ప‌రువు నిల‌బెట్టుకునేందుకు ఈ కొత్త ఎత్తుగ‌డ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని.. జాతీయ‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ ఇప్ప‌టికే పీకేను చేర్చుకోరాద‌ని.. రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లు పెట్టిన ఆయ‌న‌ను త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని.. సంకేతాలు పంపేసింది. ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం నుంచి ఈ వార్త‌.. జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది.

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌ను పార్టీలో చేర్చుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో పాగా వేయాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యాన్ని కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ నాయ‌కులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. పీకేను పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని మెజారిటీ నేతలు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు.

కీల‌క దిగ్గ‌జ కాంగ్రెస్ నాయ‌కులు దిగ్విజయ్ సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సుర్జేవాలా, జైరాం రమేశ్‌ వంటివారు పీకేను ఎట్టిప‌రిస్థితిలోనూ పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని తేల్చిచెప్పారు. ``ఆయ‌న రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లు పెట్టారు. ఆయ‌న‌కు మ‌న పార్టీ క‌న్నా.. ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తోనే ప‌నిచేయ‌డం ఇష్టం. అలాంటి వ్య‌క్తి వ‌ల్ల మ‌న‌కు డ్యామేజీ అవుతుంది. కాబ‌ట్టి వ‌ద్దు!`` అని జైరాం ర‌మేష్‌.. ఏకంగా ఘాటు ట్వీట్ చేశారు.

ఇక‌, ఇత‌ర నేత‌లు కూడా.. పీకేను తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇప్ప‌టికే వైసీపీ, టీఆర్ ఎస్ వంటి వాటితో ఆయ‌న ఒప్పందాలు చేసుకున్నార‌ని.. ఆయ‌న వాటిని ప‌నిచేస్తూ.. మ‌న‌కు ఎలాంటి స‌ల‌హాలు ఇస్తార‌న్న‌ది వారి ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంతేకాదు.. పీకే క‌న్నా.. మ‌న‌కు ఎక్కువే తెలుసున‌ని.. దిగ్విజ‌య్ సింగ్ ఆఫ్‌దిరికార్డుగా చెబుతూనే ఉ న్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పీకేను చేర్చుకుంటే.. పార్టీ మ‌రింత న‌ష్ట‌పోతుంద‌ని.. పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు.. సోనియా కూడా భావిస్తున్న‌ట్టు జాతీయ‌స్తాయిలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఎందుకంటే.. ఇప్ప‌టికే అస‌మ్మ‌తి నేత‌లైన ఆజాద్ సహా 23 మందిని లైన్‌లో పెట్టేస‌రికి సోనియాకు త‌ల‌కు మించిన ప‌రిణామంగా మారిపోయింది.

ఈ స‌మ‌యంలో వారంతా మూకుమ్మ‌డిగా వ‌ద్దంటున్న పీకేను చేజేతులా పార్టీలోకి ఆహ్వానించి.. కొత్త కుంప‌టి పెట్టుకుంటే.. ఇది చ‌ల్లారేదెప్పుడు..? పార్టీ ప‌రుగులు పెట్టేదెప్పుడు? అని సోనియా ఆలోచిస్తున్న‌ట్టుగా కూడా తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే పీకే సేవ‌లు అవ‌స‌రం లేద‌నే తీర్మానం పైనే సోనియా మొగ్గు చూపిన‌ట్టు సంకేతాలు వ‌చ్చాయి.

ఇక‌, ఈ విష‌యంపై కాంగ్రెస్ అధిష్టానం.. అర‌గంట‌లోనో.. గంట‌లోనే ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని తెలిసిన పీకే.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ఎలానూ.. త‌నను కాంగ్రెస్ తీసుకోద‌ని.. త‌న‌ను గెంటేస్తార‌ని.. త‌న‌కు ఎలాంటి విలువ లేద‌ని.. గ్ర‌హించిన ఆయ‌న త‌నే స్వ‌యంగా త‌ప్పుకొంటున్న‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చాడు.

త‌నే స్వ‌యంగా త‌ప్పుకొంటున్న‌ట్టు స్కెచ్ వేసి.. ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. ``సాధికారిత బృందంలో భాగం కావడం సహా ఎన్నికల బాధ్యత తీసుకునేందుకు కాంగ్రెస్‌లో చేరాలన్న ప్రతిపాదనను తిరస్కరించా. నేను పార్టీలో చేరడం కన్నా.. కాంగ్రెస్‌కు నాయక త్వం అవసరం. ఎన్నో నిర్మాణాత్మక సమస్యల్లో కూరుకుపోయిన పార్టీలో ఉమ్మడి సంకల్పం, సంస్కరణలు అవసరం.`` అని పీకే ట్వీట్ చేశాడు.

దీని అంత‌రార్థం.. త‌నే త‌ప్పుకొంటున్నాన‌ని..త‌న‌ను ఎవ‌రూ కాద‌న‌లేద‌ని.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. ఒక‌సారి కాంగ్రెస్ క‌నుక ``పీకే మాకు అవ‌స‌రం లేదు.. ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకోవ‌డం లేదు`` అని ప్ర‌క‌ట‌న చేస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు పీకే సంపాయించుకున్న ప‌రువు మొత్తం.. గంగ‌లో క‌లిసిన‌ట్టే అవుతుంది.

అందుకే.. ఉన్న ఆ కాస్త ప‌రువును కొంత `క‌ల‌రింగ్` ఇచ్చుకుని కాపాడుకున్నాడ‌ని.. అంటున్నారు జాతీయ రాజ‌కీయ విశ్లేష‌కులు. అంటే.. పొమ్మంటార‌ని తెలిసి.. త‌నే పోయాడ‌న్న మాట‌!! ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. త‌ను ఎంతో ఇష్ట‌ప‌డే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా మాకు పీకే సేవ‌లు అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం!! ఇవ‌న్నీ.. ఒకే రోజు.. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌ర‌గ‌డాన్ని బ‌ట్టి .. పీకే ఇమేజ్ పూర్తిగాడ్యామేజీ అవుతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పీకే చుట్టూ తిరిగిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ``వ‌ద్దు పొమ్మ‌ని..`` నేరుగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితోనే చెప్పించారంటే.. పీకే ఇమేజ్ డౌన్ అయిపోతోంద‌ని గుర్తించ‌బ‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కార‌ణం ఏంటి?

కాంగ్రెస్ సీనియ‌ర్లు పీకేను వ్య‌తిరేకించ‌డానికి ఆయ‌న‌కు ఉన్న రాజ‌కీయ విస్తృత సంబంధాలేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే..ఐప్యాక్ ద్వారా.. పీకే.. అన్ని రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాల‌ను చ‌క్క‌బెడుతున్నారు. ఇప్పుడు దీనిపైన‌నే కాంగ్రెస్ నేత‌లు సీరియ‌స్‌గా ఉన్నారు. ఐప్యాక్‌ను మూసివేసుకోవాలని, ఇతర పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలని కొందరు నేతలు అంటున్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ ఎస్‌తోపాటు పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో కాంగ్రె్‌సకు ప్రత్యర్థులైన పార్టీలతో ఆయనకు సంబంధా లున్నాయనేది వీరి అభ్యంత‌రం.