Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ కిశోర్‌.. 'బిజినెస్ మైండ్‌' ఇదేనా?

By:  Tupaki Desk   |   26 April 2022 11:38 AM GMT
ప్ర‌శాంత్ కిశోర్‌.. బిజినెస్ మైండ్‌ ఇదేనా?
X
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్రశాంత్ కిశోర్.. ఏం చేసినా ప‌క్కా బిజినెస్ మైండ్‌తోనే చేస్తార‌నేది అంద‌రికీ తెలి సిందే. ఎప్పుడు ఎక్క‌డ ఎవరికి ప‌నిచేసినా.. ఇదే ప్లాన్ వినియోగిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆయ‌న ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాల‌నేది పీకే వ్యూహం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్ప‌టికే 377 నుంచి 400 సీట్ల టార్గెట్‌ను ఆ పార్టీకి ఆయ‌న నిర్దేశించారు. అదేస‌మ‌యంలో పార్టీ బ‌ల‌హీనంగా ఉండి.. ప్రాంతీయ పార్టీల హ‌వా ఎక్కువ‌గా ఉన్న చోట్ల మాత్రం... ప్రాంతీయ పార్టీల‌తో పొత్తుకు ప్ర‌తిపాదించారు..

మ‌రోవైపు.. ఆయా ప్రాంతీయ పార్టీల‌ను కాంగ్రెస్‌కు చేరువ చేసే సూత్రాన్ని కూడా.. పీకేనే తెర‌మీదికి తెచ్చా ర‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం దేశంలోని కీల‌క‌మైన నాలుగు రాష్ట్రాల్లో ప్ర‌బుత్వాలు ఏర్ప‌డ డంలో పీకే వ్యూహాలు ప‌నిచేశాయ‌ని ప్ర‌చారం ఉంది. వీటిలో త‌మిళ‌నాడు, ఏపీ, ప‌శ్చిమ బెంగాల్‌, బిహార్‌. ఆయారాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పీకేకు ప‌రిచ‌యం బాగానే ఉంది. అయితే.. వీటిలోనూ.. ఒక్క బిహార్ మిన‌హా.. ఇత‌ర మూడు రాష్ట్రాలు కూడా.. పీకే క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తున్నాయ‌యి.

ఇప్ప‌టికీ ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, సీఎంలు కూడా పీకే నుంచి స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారు పీకే చెప్పిన‌ట్టు వింటార‌ని.. చేస్తార‌ని కూడా ప్రచారంలో ఉంది. ఈ వ్యూహంతోనే కాంగ్రెస్‌కు ఆయా ప్రాంతీయ పార్టీల‌ను చేరువ చేసి.. బ‌లోపేతం చేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేలా కాంగ్రెస్‌ను మార్చాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కేంద్రకంగా కూటమి ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఆయన తనకు ఎంతో విశ్వాస పాత్రులుగా ఉన్న ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికికాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌, మ‌మ‌త‌లు సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో వీరిని బుజ్జ‌గించేందుకు, రాజకీయ వైరాలను పక్కనపెట్టి పార్టీలను కలుపుకొని పోవాలని ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్న‌విష‌యం తెలిసిందే.

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కేసీఆర్, మమత బెనర్జీ వంటివారు ఇంతకుముందు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. కానీ, ప్రశాంత్ కిశోర్ మాత్రం.. వ్యూహకర్తగా ఆయా పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలో పీకే మాటకు నేతలు విలువ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పీకే.. త‌న బిజినెస్ ఐడియాను ఇలా వినియోగిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ఇప్ప‌టికే పీకే.. త‌న‌న‌కు అనుకూలంగా ఉఉన్న రాష్ట్రాల్లో వ్యూహాన్నిఅమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌., తాజాగా తెలంగాణ‌లోనూ.. పీకే వ్యూహాల‌కు అనుగుణంగా.. ఇక్క‌డ పార్టీలు.. కేంద్రంలోనిమోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం.. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు రువ్వ‌డం వంటివి చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయా పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. త‌న వెంటే న‌డుస్తాయ‌ని..ఆయ‌న భావిస్తున్నారు. అయితే, ఏపీలో మాత్రం వైసీపీ.. కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్ట‌డం అంత ఈజీకాద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.