Begin typing your search above and press return to search.
పీకేను బుక్ చేసేందుకు మోడీ టీం స్కెచ్
By: Tupaki Desk | 25 April 2020 5:30 PM GMTప్రధాని నరేంద్రమోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మొదట విమర్శించేది దేశంలోనే పేరొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్l.. అలియాస్ పీకే. ఈయనపై నజర్ పెట్టిన మోడీ-అమిష్ షా ద్వయం ఇప్పటికే జేడీయూ నుంచి సాగనంపింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో జట్టుకట్టి మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. రాబోయే బెంగాల్ ఎన్నికల్లో మమతను గెలిపించే పనిలో పీకే బిజీగా ఉన్నారు.
మోడీ, షా ద్వయానికి కొరకరాని కొయ్యగా పీకే తయారయ్యాడు. ఢిల్లీలో బీజేపీని చిత్తుగా ఓడించి కేజ్రీవాల్ ను సీఎం చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఇలా కంట్లో నలుసుగా మారిన పీకే ఎక్కడ దొరుకుతారా అని వేచిచూస్తున్న మోడీషాలకు కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా ప్రశాంత్ కిషోర్ ఓ చోట బుక్కయ్యాడని వార్తలు వచ్చాయి.
లాక్ డౌన్ వేళ దేశంలో విమాన ప్రయాణాలు నిషేధం. కానీ ఇటీవల ఢిల్లీ నుంచి బయలు దేరిన మూడు కార్గో విమానాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. ఒకదాంట్లో ప్రశాంత్ కిషోర్ కోల్ కతాకు ప్రయాణించాని వార్తలు వచ్చాయి. బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటనే ప్రశాంత్ కిషోర్ ను కోల్ కతాకు రావాలని కోరడంతో ఆయన విమానంలో కోల్ కతాకు వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో మోడీ ఊరుకుంటాడా? ప్రశాంత్ కిషోర్ దొరికాడని వెంటనే దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. పీకే ప్రయాణంపై ఢిల్లీ, కోల్ కతా విమానాశ్రయాల్లోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. విమానయాన శాఖ దర్యాప్తుచేస్తోంది. మమతను బెంగాల్ లో గెలిపించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే ప్రస్తుతం ఉన్నారు. దీంతో పీకేను బుక్ చేయడానికి కేంద్రంలోని బీజేపీ రెడీ అయ్యింది.
అయితే తాను లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి కోల్ కతాకు వెళ్లలేదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ ప్రయాణించినట్లు ఏమీ నిర్ధారణ కాలేదని అధికారులు అంటున్నారు. పూర్తి నివేదిక వచ్చాక తేలనుంది. ఒకవేళ పీకే కనుక ప్రయాణిస్తే ఆయనపై కేసులు సహా అన్ని బుక్ చేసి ఇరుకున పెట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది.