Begin typing your search above and press return to search.
కేసీఆర్ తో పీకే భేటీ..?: వచ్చే ఎన్నికల కోసమేనా..?
By: Tupaki Desk | 2 Dec 2021 9:17 AM GMTతెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికతో రాజకీయం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.ఈ ఉప ఎన్నిక అధికార పార్టీ టీఆర్ఎస్ ను అప్రమత్తం చేసినట్లయింది. అప్పటి వరకు కేసీఆర్ మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ అందుకు ఒక్కో అస్త్రాన్ని ఇప్పటి నుంచే వదులుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఒకడుగు ముందుకేసి రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)తో భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ తో సమావేశమైన పీకే తాజాగా కేసీఆర్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆరేళ్లుగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ కు దుబ్బాక ఉప ఎన్నిక నుంచి వ్యతిరేక పవనాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికనుత తేలిగ్గా తీసుకోవడంతో అక్కడ ఓడిపోయామని భావించినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ కొట్టింది. అయితే ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ హవా సాగింది. అయితే అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్ ఎన్నికతో మాత్రం రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఏ ఎన్నికకు తేలిగ్గా తీసుకోకూడదని భావించిన గులాభి దళపతి అప్పటినుంచి బీజేపీతో గట్టిగా పోరాడుతున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా పుంజుకోవడంతో కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఆయన పీకేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక తాను ఒంటిరి వ్యూహంతో కాకుండా పీకే సాయంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుండడంతో కేసీఆర్ కేంద్రంతో తగాదా పెట్టుకుంటున్నాడు. కేంద్రం, రాష్ట్రం బీజేపీలపై రకరకాల ఆరోపణలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు. అయితే వివిధ సర్వేల ద్వారా తనకు వ్యతిరేకత ప్రారంభమైందన్న రిపోర్టు తెలుసుకోవడంతో ఇక పీకే టీం ద్వారా అసలు జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు వరకు పదే పదే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అనుకున్న సమయానికి మోదీని కలిసి వచ్చేవారు. కానీ ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి వారం పాటు ఉన్నా ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని తిరిగి వచ్చారు. అయితే మోదీతో కలవడం ఇష్టం లేకనే అసలు అపాయింట్ మెంట్ తీసుకోలేదని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నారు. దీంతో బీజేపీకి తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పేందుకు ఇలాంటి వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని విషయాల్లో తెలంగాణ సీఎంపై సామాన్యులు సైతం రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇతరుల సాయం అవసరమని భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన పీకేతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పీకే కనుసన్నల్లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సమాయత్తమవుతోంది. అయితే దేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో ఆయన కలిశారా..? అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతోంది.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయానికి పీకే సహకరిస్తే మమతకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కేసీఆర్ థర్డ్ ప్రంట్ పేరిట మమతను కలిశారు. ఆ తరువాత ఎలాంటి చడీ చప్పుడు లేకుండా మళ్లీ మోదీతో దోస్తీ చేశారు. దీంతో కేసీఆర్ మమతను నమ్మలేకపోయింది. కానీ మళ్లీ మమతకు మద్దతు ఇస్తారా..? అని అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పీకేతో భేటీ అయ్యారని చర్చించుకుంటున్నారు.