Begin typing your search above and press return to search.
ప్రశాంత్ కిశోర్ టీం.. ఏపీలోకి అడుగు పెట్టలేదా? ఎందుకు?
By: Tupaki Desk | 20 Sep 2021 4:56 AM GMTవైసీపీ వ్యూహకర్త.. మేధావి ప్రశాంత్ కిశోర్ టీం ఏపీలోకి అడుగు పెట్టలేదా? ఎందుకు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. 2016 నుంచి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టింగ్ చేసి 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇదీ ఇప్పటి వరకు తెలిసిన విషయం. కానీ, అసలు విషయం అది కాదని అంటున్నారు పరిశీలకులు. కేవలం ప్రశాంత్ కిశోర్ బృందం.. క్లిరకల్ పని మాత్రమే చేసిందని.. కష్టపడింది మాత్రం వైసీపీ ఇంచార్జ్‌లు, నేతలు, సోషల్ మీడియా, బూత్ లెవల్ కార్యకర్తలు, కమిటీలు.. అని చెబుతున్నారు.
అంతేకాదు, పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి పాదయాత్ర రూపంలో జగన్ వచ్చారు. అదేసమయంలో ఆయన మాతృమూర్తి, సోదరి.. లు ప్రజలను ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అభ్యర్థించారు. దీంతో ప్రజలు మెచ్చి.. జగన్‌కు అధికారం కట్టబెట్టారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ప్రజలు వైసీపీకి ఇచ్చారు. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితిని పక్కన పెట్టి.. కేడర్‌ను పట్టించుకోవడం మానేసి.. కేవలం గెలుపు మొత్తాన్ని ప్రశాంత్ కిశోర్ తన ఖాతాలో వేసుకున్నారు. కేడర్‌కు అసలు గుర్తింపు ఇవ్వలేదని.. ఇప్పుడుఅసలు కేడర్ ఉందో లేదో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో పీకే టీంను పరిశీలిస్తే.. ఈ బృందంలో ఎంతమంది ఉంటారు. కేవలం 200 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితోనే ఒక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేస్తే.. ఇంక చెప్పేదేముంది..? ప్రతి ఎమ్మెల్యే ఈ దేశంలో ఓ 200 మందిని కలుపుకొని పార్టీ పెట్టే పరిస్థితి ఉంటుంది.
పీకే టీం కేవలం చేసింది క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాన్ని పరిశీలించడంతోపాటు.. ఇంచార్జ్‌లను.. ఎమ్మెల్యేను ఇండైరెక్ట్‌గా బెదిరించి వాళ్లతో ఖర్చు పెట్టించి.. జనాలను పోగు చేసి.. కేడర్‌కు అబద్దాలు చెప్పి.. వాళ్లకు ఆశలు పెట్టించి.. పని చేయించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల సమయంలో పీకే బృందం.. క్షేత్రస్థాయిలో నాయకులను బాగానే ఊరించింది. మండల కన్వీనర్ల నుంచి బూత్ కమిటీల వరకు అంతా మీకే ఇస్తారు.. అని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. కనీసంవారి ముఖం కూడా చూడడం లేదు.
ఇలా.. పార్టీ కేడర్‌ను అన్నివిధాలా మోసం చేశారనే వాదన ఉంది. ఎన్నికల తర్వాత వాళ్ల ఫోన్లు పనిచేయవు. ఎందుకంటే.. పీకే టీం పనిచేస్తే.. తప్పుడు, గాలి కబుర్లు.. చెప్పి.. పని చేయించుకుని ఇప్పుడు ఏమో.. మొహం చాటేస్తున్నారని కేడర్ వాపోతోంది. అయితే.. ఇటీవల ఏపీ సీఎం జగన్ మళ్లీ.. పీకే వస్తాడు.. ప్రజల దగ్గరకు వెళ్లాలని.. అందరికీ చెబుతున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే.. దీని మీద కేడర్ పెద్ద ఎత్తున చర్చిస్తోంది. ``వాళ్లను(పీకే) రానివ్వడం.. ఈ సారి..మా సత్తా చూపిస్తాం.. వాళ్లు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు చేసింది ఏంటి? అధికారం కోసం.. మమ్మల్ని.. వాడుఉకుని.. మమ్మల్ని సర్వనాశనం చేశారు. పీకే టీం వస్తే.. గ్రామాల్లోకి రానీయకుండా చూస్తాం`` అని అంటున్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పీకే టీంపై గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. వాళ్లు వస్తే.. తమమీదే భారం పడుతుందని.. అందుకే వాళ్లను ఏదో విధంగా రానీయకుండా చేయాలని.. కూడా చర్చించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలోఏపీలో మల్లీ పీకే టీం పర్యటన.. ఎలా సాగుతుందో చూడాలి.
ఈ ఆర్టికలపై మీ దగ్గర ఇంకా సమాచారం ఉంటే.. కామెంట్ రూపంలో పంపండి. నిజమైన సమాచారం అయితే.. ఈ ఆర్టికల్‌ను ప్రచారం చేస్తామని తుపాకీ తన పాఠకులకు హామీ ఇస్తోంది.