Begin typing your search above and press return to search.
పెళ్లి వేడుకకు ఇద్దరు సీఎంలు వెంట ఆ ఇద్దరు మంత్రుల్నే తీసుకొచ్చారే?
By: Tupaki Desk | 22 Nov 2021 7:00 AM GMTయాదృశ్చికంగా జరిగిందో.. లేదంటే కావాలనే తీసుకొచ్చారో తెలీదు కానీ.. ఆదివారం పోచారం ఇంట జరిగిన పెళ్లికి రెండు తెలుగు రాస్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విశేషాలు చోటు చేసుకున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు పంచాయితీలు చోటు చేసుకున్న వేళ.. విభేదాల్ని సర్దుబాటు చేసుకోవటం కోసం అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ ప్రయత్నం చేయలేదన్న విమర్శ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఇద్దరు ఘాటు వ్యాఖ్యలు చేయటం అప్పట్లో సంచలనమైంది.
ప్రాజెక్టు పంచాయితీల వేళ.. తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను చిన్నబుచ్చేలా... ఆయన ప్రభుత్వ వైఖరిని చులకనగా చేస్తూ మాట్లాడారు. నిధుల్లేక జగన్ కేంద్రం వద్ద భిక్షమెత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దీనికి కౌంటర్ గా ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించటం.. ‘కేసీఆర్ లా మేం లోపల కాళ్లు పట్టుకోం. ఆయన పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? హైదరాబాద్ ఉండి కూడా తెలంగాణ ఎందుకు అప్పులపాలైంది?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఇలా ఇద్దరు మంత్రులు విరుచుకుపడటం.. ఆ తర్వాత మాటలు బంద్ కావటం తెలిసిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. పోచారం ఇంట జరిగిన పెళ్లికి హాజరైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వెంట.. ఆ ఇద్దరు మంత్రుల్ని తీసుకురావటం ఆసక్తికరంగా మారింది.
తాము విధేయులుగా ఉండే ముఖ్యమంత్రులకు దన్నుగా నిలిచే ఈ ఇద్దరు.. ఎదుటి సీఎంపై ఘాటు విమర్శలు చేయటానికి సైతం వెనుకాడలేదు. ఈ పెళ్లికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు హాజరైనా.. వీరిద్దరు ముఖ్యమంత్రుల వెంట ఉండటం మాత్రం ఆసక్తికరంగా మారింది.