Begin typing your search above and press return to search.
నోరు జారిన తెలంగాణా మంత్రికి వాస్తవం తెలియదా?
By: Tupaki Desk | 13 Nov 2021 10:34 AM GMTతెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈరోజు బిచ్చమెత్తుకుంటున్నారని చెప్పారు. నిధుల కోసం జగన్ కేంద్రాన్ని బిచ్చమెత్తుకుంటున్నారని అన్నారు. నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నట్లు ప్రశాంత్ రెచ్చిపోయారు. ఒక విధంగా చూస్తే నిధుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే.
ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ప్రధాన కారణం యూపీఏ ప్రభుత్వమే అని చెప్పకతప్పదు. 2014లో యూపీఏ ప్రభుత్వం అడ్డుగోలుగా రాష్ట్ర విభజన చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజధాని హైదరాబాద్ తో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి నిధుల విషయంలో కామధేనువు లాంటి హైదరాబాద్ ను తెలంగాణాకు ఇచ్చేయటమే కాకుండా మిగులు బడ్జెట్ తో పాటు అనేక ఆస్తులను కూడా తెలంగాణాకే ఇచ్చేసింది. ఇదే సమయంలో అప్పులను, లోటు బడ్జెట్ ను ఏపీ ఖాతాలో వేసింది.
దాంతో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఏర్పాటైతే, ఏపీ లోటు బడ్జెట్ తో మొదలైంది. ఇది కాకుండా అప్పటివరకు రాష్ట్రం చేసిన అప్పుల్లో ఏపీ వాటా కూడా తోడవ్వటంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్ధితి దారుణంగా తయారైంది. జగన్ అధికారంలోకి వచ్చేసరికే 2.4 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయింది. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
ఇదే సమయంలో జగన్ కూడా సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నీ క్యాష్ పథకాలే. పులిమీద పుట్రలాగ గడచిన ఏడాదిన్నరగా కరోనా వైరస్ సమస్య తోడైంది. దీంతో అప్పులు చేయడంలో ఏపీ రికార్డుల మీద రికార్డు సృష్టించింది. గతంలో ఐదారు ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు కంటే జగన్ ఒక్కడ 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పే ఎక్కువ. అందుకనే నిధుల సమీకరణలో జగన్ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది.
అయితే మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం కూడా ఇపుడు అప్పుల్లో ఎందుకు కూరుకుపోయింది ? కామధేనువు లాంటి హైదరాబాద్ ఉండికూడా అప్పుల్లో కూరుకుపోవటమే కాకుండా నిధుల కోసం వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఎందుకని వేలంపాటల్లో అమ్ముకుంటున్నట్లు ?
అప్పట్లోనే యూపీఏ ప్రభుత్వం కాస్త విచక్షణ ఉపయోగించుంటే ఏపీకి ప్రస్తుత పరిస్ధితి ఉండేదికాదు. అలాగే తెలంగాణా కి హైదరాబాద్ ను ఇచ్చుండకపోతే ఆర్ధిక పరిస్ధితి ఎలాగుండేదో మంత్రి ఒకసారి ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. అయినా ఏపి మంత్రులు ఎప్పుడూ తెలంగాణా ఆర్ధికపరిస్ధితి గురించి కామెంట్ చేయలేదు. మరెందుకని తెలంగాణా మంత్రి ఏపీ ప్రభుత్వంపై నోటికొచ్చింది మాట్లాడుతున్నారు ? అందుకనే ఏపీ మంత్రి పేర్నినాని చెప్పినట్లు అత్తమీద కోపం దుత్తమీద చూపుతున్నది కరెక్టేనా ?