Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్ వెనుక కారణమిదే..

By:  Tupaki Desk   |   1 Nov 2018 8:13 AM GMT
సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్ వెనుక కారణమిదే..
X
పచ్చని కాపురం చిన్నాభిన్నమైంది.. భర్త ఆత్మహత్య చేసుకోగా భార్య జైలుపాలైంది.. వీరిమధ్యన వచ్చిన మూడో వ్యక్తి కారణంగా వీరి జీవితాలు ఎటూ కాకుండా పోయాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల జీవితాలు ఎలా ఉంటాయో.. ఎలా అంతర్థానం అవుతాయో.. ఆకర్షణలు, ప్రేమల మాయలో ఎలా కుదేలవుతాయో ఈ వాస్తవ ఘటన కళ్లకు కడుతోంది..

కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్ ఐఐటీలో చదువుకొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. వరంగల్ కు చెందిన పావనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లుగా కాపురం సజావుగానే సాగింది. కానీ పావని.. తన ఆఫీసులో పనిచేసే ప్రణయ్ వేములతో సన్నిహితంగా ఉండడాన్ని భర్త భరించలేకపోయాడు.. ప్రణయ్ కు బెంగళూరు ట్రాన్స్ ఫర్ కావడంతో పావని కూడా అక్కడికే ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ఇదే ప్రశాంత్ లో అనుమానానికి కారణమైంది. దీనిపై నిలదీయడంతో భార్యభర్తల మధ్య పెద్ద గొడవైంది. భార్య పావనిని ఎంతగా బతిమిలాడినా తనతో ఉండడానికి ఒప్పుకోకపోవడంతో చివరకు ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో ప్రశాంత్ రాసిన మాటలను బట్టి ఆయన భార్య కారణంగానే చనిపోయినట్టు పోలీసులు తేల్చారు..

‘నా భార్య ప్రణయ్ వేములతో కలిసి ఉంటోంది. ఆమె నన్ను మోసం చేసింది’ అని సూసైడ్ నోట్ లో ప్రశాంత్ రాసుకున్నాడు. ఆ తర్వాత ప్రణయ్-పావని మాట్లాడుకున్న ఆడియోను కూడా పోలీసులు సంపాదించారు. ప్రశాంత్ కుటుంబసభ్యులు పావని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలు ఉండడంతో ప్రశాంత్ ఆత్మ హత్యకు పావని పెట్టుకున్న వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. ఆమెను అరెస్ట్ చేశారు.

ప్రేమించేటప్పుడు జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటారు. అనంతరం పెళ్లి చేసుకొని .. వాస్తవ జీవితంలోకి దిగాక పని ఒత్తిడిలో బంధాలకు దూరమవుతారు. జీవిత భాగస్వాములకు సరైన టైం కేటాయించలేరు. దీంతో అపర్ధాలు పొడచూపి జీవితాలు పక్కదారిపడుతున్నాయి. ఆధునిక పోకడలు - ఐటీ జీవితాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు.