Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత కిషోర్ సర్వే! : బండి సంజయ్ వెయిట్ ఎంత?

By:  Tupaki Desk   |   25 Jun 2022 4:15 AM GMT
ప్ర‌శాంత కిషోర్ సర్వే! : బండి సంజయ్ వెయిట్ ఎంత?
X
తెలంగాణ వాకిట ప్ర‌శాంత్ కిశోర్ అనే ఓ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త రాష్ట్రం అంతటా ఓ స‌ర్వే చేశాడ‌ని టాక్. ఆ టాక్ ప్ర‌కారం బండిసంజయ్ ఎఫెక్టు పెద్ద‌గా బీజేపీ పై లేద‌ని తేలిపోయింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆ పార్టీ మూడో స్థానానికి ప‌రిమితం అవుతుంద‌న్న వార్త కూడా బీజేపీ అధిష్టానాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది.

ఇక కాంగ్రెస్ నుంచే టీఆర్ఎస్ కు సిస‌లు పోటీ ఉంద‌ని తేలిపోయింది. అందుకే ఇక‌పై టీఆర్ఎస్ వ్యూహాలు కూడా మారిపోనున్నాయి. బీజేపీని అదే ప‌నిగా టార్గెట్ చేసినా ఫ‌లితం లేద‌ని తేలిపోయాక, ఇక గేర్ మార్చి రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయం న‌డ‌పుదామని చూస్తోంది.

ఇప్ప‌టికే కాంగ్రెస్ రాష్ట్రంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. వ‌రుస నిర‌స‌న‌లు చేస్తూ అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రేవంత్ రెడ్డి ఒన్ మ్యాన్ షోతో కొన్ని ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ఆశ కూడా వారిలో రేగుతోంది.

ఇక విమ‌ర్శ‌కుల అభిప్రాయం ప్ర‌కారం.. టీఆర్ఎస్ కూడా త‌న‌దైన బాణీలో కాంగ్రెస్ ను నిలువ‌రించాల‌ని చూస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉన్న అసంతృప్తిని అయితే నివారించ‌లేక‌పోతోంది. అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు సరైన అవ‌కాశాలు ఇవ్వ‌లేక‌పోతోంది.

ఈ రెంటినీ స‌రిగా బ్యాలెన్స్ చేయ‌గ‌లిగితే టీఆర్ఎస్ గ‌ట్టెక్క‌గ‌ల‌దు. మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాల‌లోకి కేసీఆర్ వెళ్తే టీఆర్ఎస్ ఏమౌతుంది అన్న డౌట్ కూడా ఉంది. భార‌తీయ రాష్ట్ర సమితి పార్టీ పెడితే కేసీఆర్ జాతీయ స్థాయిలోకి వెళ్లిపోతే ఇక్క‌డి ప‌రిణామాలు ఎవ‌రు చూస్తారు అన్న డౌట్ ఉంది.

యువ రాజు కేటీఆర్ ఉన్నా కూడా ఆయ‌న స్థాయి కేసీఆర్-ది కాద‌ని కూడా అభిప్రాయం వ‌స్తోంది. క‌నుక కాంగ్రెస్ ను నిలువ‌రిస్తూనే కేసీఆర్ జాతీయ స్థాయి రాజ‌కీయాలు చేయాల్సి ఉంది. ఒకే సారి రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం సాధ్యం కాద‌న్న వాద‌న కూడా ఉంది.