Begin typing your search above and press return to search.
గురువు చెప్పలేదు కానీ శిష్యుడు చెప్పేశాడు
By: Tupaki Desk | 27 March 2016 10:36 AM GMTచేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే చెప్పలేదన్న విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పార్టీ నడపటం తేలికైన విషయం కాదని.. అందునా అధికారం అందనంత దూరాన ఉన్న సమయంలో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలన్న విషయం ఆయనకు అర్థమయ్యేలా చేసిన ఘటనగా తాజా పరిణామాన్ని చెప్పొచ్చు.
ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని విపరీతంగా కోరుకున్న పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రును కాదని.. మొదటిసారి గెలిచిన ఒక జూనియర్ ఎమ్మెల్యేకి అప్పచెప్పటం ద్వారా.. జగన్ పార్టీ నేతల ‘ఇగో’ను హర్ట్ చేశారు. పదవిని జ్యోతుల నెహ్రు కోరుకుంటున్నారన్న మాట చెబితే.. అలాంటి పదవికి ‘లెక్కలు బాగా రావాల్సి ఉంటుంది’’ అన్న మాటతో మరింత మంటెక్కేలా చేశారు.
అధినేత నుంచి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు విన్నాక.. పార్టీలో ఉండటం మంచిది కాదనుకుంటున్న జ్యోతులకు తెలుగు తమ్ముళ్ల వైఖరి మరింత ప్రోత్సాహకరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెహ్రు రాకకు ఇప్పటికే పచ్చ జెండా ఊపేసిన ఏపీ అధికారపక్షం.. ‘‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండి’’ అంటూ సంతోషంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండటం.. ఆ పార్టీకి చెందిన కాపు నేతలు సైతం జ్యోతులగారు కమాన్ రండి అంటూ ఉత్సాహ పరుస్తున్న వేళ ఆయన.. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే.. జ్యోతుల పార్టీ మారుతున్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జ్యోతులకు అత్యంత సన్నిహితుడైన పత్తిపాడు ఎమ్మెల్యే వరువుల సుబ్బారావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. తాను సైకిల్ ఎక్కనున్నట్లు చెప్పేశారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందిందని.. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
తన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకే అధికారపక్షంలో చేరుతున్నట్లుగా సుబ్బారావు వెల్లడించారు. గురువు పార్టీ మారుతున్న విషయంపై పెదవి విప్పకున్నా.. శిష్యుడు మాత్రం అందుకు భిన్నంగా తాను పార్టీ మారుతున్న విషయాన్ని కుండబద్ధలు కొట్టేయటం గమనార్హం. తాజా పరిణామాలు చూస్తుంటే.. శిష్యుడు పార్టీ మారితే గురువుగారు మారకుండా ఉంటారా?