Begin typing your search above and press return to search.
పవన్ అభివృద్ధిని అడ్డుకోకు ఏపీ మంత్రుల విసుర్లు
By: Tupaki Desk | 20 Aug 2015 12:19 PM GMTరాజధాని భూముల వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రుల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. మంత్రి యనమల తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ గురువారం ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ తాను ఎంతో విజ్ఞతతో రైతుల బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళితే దానిని వెటకారం చేయడం మంత్రి యనమలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు స్పందించారు.
ప్రత్తిపాటి మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పవన్ ఎంతో కృషి చేశారని..ఆయన్ను ఉద్దేశించి ఏ మంత్రి కూడా వెటకారంగా మాట్లాడలేదని ఘాటుగానే రిప్లే ఇచ్చారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని..ఇదంతా ఓర్వలేని కొందరు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. రైతులను ఒప్పించే తాము మిగిలిన భూసేకరణ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని...రైతులెవ్వరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంతకు ప్రత్తిపాటి ఇంత మాట్లాడినా మిగిలిన 2200 ఎకరాలభూసేకరణకు గాను తొలిదశలో 700 ఎకరాల రైతులకు నోటీసులిస్తామని పరోక్షంగా భూసేకరణ చట్టం గురించి ప్రభుత్వ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.
మరో మాంత్రి రావెల కిషోర్ బాబు మాత్రం పవన్ వ్యాఖ్యలపై విసుర్లు విసిరారు. కేవలం 3 వేల ఎకరాల విషయంలో పవన్ ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని...రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే ఈ 3 వేల ఎకరాల విషయాన్ని పవన్ అనవసరంగా పెద్దది చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల కోసమే, సెజ్ ల కోసమే తాము భూసేకరణ చేయడం లేదన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని..విలువైన సూచనలు ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని రావెల పవన్ కు సూచించారు.
ఈ ఇద్దరు మంత్రల మాటల్లో యనమల వెటకారం చేశారని పవన్ అంటే కాదని ప్రత్తిపాటి అన్నారు. అంటే ప్రత్తిపాటి మాటల్లో పవన్ అబద్ధం ఆడినట్టు కనిపిస్తోంది. ఇక రావెల పవన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకోకు అని ధీటుగానే జవాబివ్వడం చూస్తే పవన్ వర్సెస్ టీడీపీ పోరు ఆగేలా లేదు. టీడీపీ-జనసేన మైత్రీ బంధం తెగే వరకు వెళ్లేలా ఉంది.