Begin typing your search above and press return to search.
బాబు ఫెయిల్యూర్ జగన్ ఖాతాలో వేస్తావా పత్తిపాటి?
By: Tupaki Desk | 15 April 2018 10:19 AM GMTఏపీ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్య ఒకటి చేశారు. ఏపీ విపక్ష నేత చేస్తున్న పాదయాత్ర మీద తనకున్న ఆసూయను చెప్పుకునే క్రమంలో ఆయన తెలీకుండా నిజాన్ని చెప్పేసి బాబు సర్కారును ఆత్మరక్షణలో పడేశారు. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లుగా ప్రత్తిపాటి పుల్లారావు ఫీలవుతున్నా.. ప్రజలు మాత్రం మంత్రిగారి మాటల్లో అసలు నిజం తమకు అర్థమైందన్న వాదనలు వినిపిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిని ప్రకటించినప్పుడు.. బాబు మాయాజాలపు మాటలతో అక్కడి భూముల ధరలు పెరిగాయి. అయితే.. రాజధాని నిర్మాణంపై బాబు చెప్పే మాటలన్ని ఉత్తవేనన్న విషయం అర్థం కావటం.. ప్రభుత్వ అవినీతి వెరసి.. బాబు పాలనపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాబు చేసిన తప్పుల్ని ఎండగడుతూ పాదయాత్ర చేస్తున్న జగన్ పై విమర్శలు చేసే క్రమంలో తమ దివాళాకోరు రాజకీయాల్ని ప్రదర్శించారు ప్రత్తిపాటి.
గుంటూరుజిల్లాలో జగన్ పాదయాత్ర చేయటం ద్వారా రాజధాని రైతుల భూముల విలువ గజానికి రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ తగ్గిపోయినట్లుగామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అమరావతిని భ్రమరావతిగా పోల్చినప్పుడు జగన్ కు పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృధ్ది కనిపిస్తుందన్నారు. ఒకవేళ.. ప్రత్తిపాటి చెబుతున్నట్లుగా అంత అభివృద్ధే జరిగితే.. బాబు మాటలన్నీ నిజమైన పక్షంలో గజానికి రూ.2-3వేలు ఎలా తగ్గాయన్న ప్రశ్నకు ప్రత్తిపాటి చెబితే బాగుంటుంది. జగన్ పాదయాత్ర కారణంగా భూముల ధరలు తగ్గితే అన్నిచోట్లా తగ్గాలి. ఆ మాటకు వస్తే.. పాదయాత్రకు.. భూముల ధరలు తగ్గటానికి మధ్యనున్న లింకేమిటన్నది మంత్రిగారు చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.