Begin typing your search above and press return to search.
అర్హత ఉన్నదెవరికో చెప్పరాదా మంత్రివర్యా?
By: Tupaki Desk | 10 Oct 2017 11:37 AM GMTవైఎస్ జగన్మోహన రెడ్డి యువభేరి పేరుతో ప్రత్యేకహోదా కోసం తన పోరాటాన్ని పున:ప్రారంభించిన తీరు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ప్రజల్లో ప్రత్యేకహోదా గురించిన ఆలోచనను చంపేయడానికి ప్రయత్నిస్తున్నతెలుగుదేశం సర్కారు, ఆ ఆలోచనకు వారిలో పోరాట స్ఫూర్తికి జగన్ మళ్లీ ప్రాణం పోస్తే చిక్కులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనంతపురంలో జగన్ యువభేరి సదస్సులో తన ప్రసంగాన్ని పూర్తి చేశాడో లేదో.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు.. అందుకోసమే కాసుక్కూచున్నట్లుగా దానికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అమరావతి నుంచి ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ మీద అనేకానేక విమర్శలు చేశారు.
మంత్రి పత్తిపాటి పుల్లారావు - మంత్రి నక్కా ఆనందబాబు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు అసలు జగన్ కు లేనే లేదని ఈ మంత్రులిద్దరూ చిలకపలుకులు వల్లించారు. అక్కడితో ప్రారంభించి.. వైఎస్ జగన్ మీద ఎన్ని కేసులు విచారణలో ఉన్నాయి. ఎన్నింటిలో ఆయన ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు.. ఆయన పాదయాత్ర చేయాలని అనుకున్నా సరే.. అనుమతి అడిగే పరిస్థితిలో ఉన్నాడు.. అంటూ అసలు ప్రత్యేక హోదాతో ఏమాత్రం సంబంధం లేని విషయాలను వాళ్లు ఏకరవు పెడుతూ.. సబ్జెక్టును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పైపెచ్చు ఈ మంత్రులిద్దరూ ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారంటే.. జగన్మోహన రెడ్డి సభలకు హాజరవుతున్న కాలేజీ విద్యార్థులు యువతరం కూడా క్రిమినల్స్ గా మారే అవకాశం ఉన్నదంటూ హెచ్చరించారు. ఇది చాలా దారుణమైన వ్యాఖ్య అని ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉన్నప్పుడు.. దానికి మద్దతుగా సమావేశానికి వెళ్లే యువతరం క్రిమినల్స్ అవుతారంటూ మంత్రులు బాద్యత లేకుండా మాట్లాడడం తగదనే విమర్శలు వస్తున్నాయి.
అదే సమయంలో మంత్రుల వైఫల్యం ఎలా బయటపడుతున్నదంటే.. హోదా గురించి జగన్ చెప్పిన ఒక్కటంటే.. ఒక్క అంశానికి సంబంధించి కూడా.. మంత్రులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. హోదా లేకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు పొందడంలో ఏ రకంగా నష్టపోతున్నామో.. జగన్ గణాంకాల సహా చెప్పారు. కనీసం ఆ లెక్కలు తప్పు అని చెప్పే సాహసం కూడా ఈ మంత్రులు చేయలేదు. జగన్ అంతా కరక్టే చెప్పినప్పుడు.. ఆయనకు హోదా గురించి మాట్లాడే అర్హత లేదని అంటున్న మంత్రులు.. అసలు అలాంటి అర్హత ఉన్నదెవరికో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.