Begin typing your search above and press return to search.
ఏపీలో ఆరాచకాలకు మంత్రే షాక్ తిన్నారు
By: Tupaki Desk | 13 Jun 2018 4:39 AM GMTపాలకులు కరకుగా ఉంటే.. ఇష్టారాజ్యంగా వ్యవహరించాలన్న ఆలోచనే రాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న భయం ఉంటే.. వ్యవస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తాయి. అయితే.. అలాంటిదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఏపీలో ఈ మధ్యన మరింత ఎక్కువైంది. తామేం చేసినా పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేకపోవటం.. చర్యలు తీసుకోవాలంటే అనునిత్యం భయపడే పాలకుల పుణ్యమా అని వ్యవస్థలు ఎంతగా భ్రష్టు పట్టిపోయాయో.. తాజాగా ఏపీ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన సమావేశం ఒకటి స్పష్టం చేసింది. అందరిని అవాక్కు అయ్యేలా చేసింది.
వినియోగదారుల రక్షణ మండలి సమావేశాన్ని తాజాగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు వింటే షాక్ కు గురి కావటం ఖాయం. ఎందుకిలా అంటే.. చట్టాన్ని మార్చాలంటూ ఆయన కొత్త మాటలు చెబుతున్నారు. ప్రజల్ని నిత్యం దోపిడీకి గురి చేసే అంశాల్ని యుద్ధ ప్రాతిపదికన క్లోజ్ చేయాల్సింది పోయి.. వాటిని తప్పుపడుతూ.. తిట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పత్తిపాటి గుర్తిస్తే మంచిది.
బ్రాండెడ్ వాటర్ బాటిళ్లను కాకుండా లోకల్ గా తయారయ్యే వాటర్ బాటిల్స్ ను షాపింగ్ మాల్స్.. మల్టీఫ్లెక్సుల యజమానులు రూ.100 చొప్పున విక్రయిస్తున్న వైనం ఆయన దృష్టికి వచ్చింది. ఇలాంటి వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని చెప్పటం పోయి.. తామేమీ చేయలేకపోతున్నామని.. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ పత్తిపాటి చెప్పటం షాకింగ్ గా మారింది.
విజయవాడలోని షాపింగ్ మాల్స్ లో తనిఖీలు నిర్వహించినప్పుడు లోకల్ వాటర్ బాటిల్ రూ.100కు అమ్ముతుంటే తామేమీ చేయలేకపోతున్నట్లుగా చెప్పటం చూస్తే.. పత్తిపాటి తాను మంత్రినన్న విషయాన్ని మర్చిపోతున్నట్లుగా కనిపించక మానదు. ప్రతి విషయానికి ఏదో ఒక లింకు ఉందని చెప్పటం.. దానికి తామేం చేయలేమన్న అశక్తతతో కూడిన మాటను చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పత్తిపాటి గుర్తిస్తే మంచిది.
ఏపీలో ఎలాంటి ఆరాచకాలు సాగుతున్నయో చెప్పే వైనాలు పత్తిపాటి వారి మాటల్లోనే చెబితే..
+ బ్రాండెడ్ కాని వాటర్ బాటిల్స్ కూడా మాల్స్.. మల్టీఫ్లెక్సుల్లో రూ.వంద చొప్పున అమ్మటం
+ కార్పొరేట్ కాలేజీల్లో 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉన్నా.. దాన్ని పట్టించుకోవటం
+ పండగ రోజుల్లో ఆర్టీసీ యాజమాన్యం వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు
+ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో టాయ్ లేట్స్ వినియోగానికి రూ.5 చొప్పున వసూలు చేయటం
+ పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు వాడితే 2 శాతం చొప్పున అదనంగా వసూళ్లు చేయటం
+ నర్సరీల్లో నకిలీ మొక్కలు అమ్మటం
వినియోగదారుల రక్షణ మండలి సమావేశాన్ని తాజాగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు వింటే షాక్ కు గురి కావటం ఖాయం. ఎందుకిలా అంటే.. చట్టాన్ని మార్చాలంటూ ఆయన కొత్త మాటలు చెబుతున్నారు. ప్రజల్ని నిత్యం దోపిడీకి గురి చేసే అంశాల్ని యుద్ధ ప్రాతిపదికన క్లోజ్ చేయాల్సింది పోయి.. వాటిని తప్పుపడుతూ.. తిట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పత్తిపాటి గుర్తిస్తే మంచిది.
బ్రాండెడ్ వాటర్ బాటిళ్లను కాకుండా లోకల్ గా తయారయ్యే వాటర్ బాటిల్స్ ను షాపింగ్ మాల్స్.. మల్టీఫ్లెక్సుల యజమానులు రూ.100 చొప్పున విక్రయిస్తున్న వైనం ఆయన దృష్టికి వచ్చింది. ఇలాంటి వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని చెప్పటం పోయి.. తామేమీ చేయలేకపోతున్నామని.. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ పత్తిపాటి చెప్పటం షాకింగ్ గా మారింది.
ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని భావించినప్పుడు.. ఒకటికి పదిసార్లు ప్రయత్నాలు చేయటం.. అప్పటికి కేంద్రం స్పందించకుంటే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయాలే తప్పించి.. మీడియా సమావేశం పెట్టి.. ఏమీ చేయలేకపోతున్నట్లుగా చెప్పటం చేతకానితనమే అవుతుంది తప్పించి మరేమీ కాదు.