Begin typing your search above and press return to search.
తను ఓడిపోలేదంటూ కాకిలెక్కలు చెబుతున్న టీడీపీ నేత!
By: Tupaki Desk | 16 Sep 2019 2:30 PM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో తను ఓడిపోలేదని చెప్పుకుంటున్నారట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు! తెలుగుదేశం పార్టీ తరఫున ఈయన పోటీ చేయడం - చిలకలూరి పేట నుంచి విడదల రజనీ చేతిలో ఓటమి పాలవ్వడం తెలిసిన సంగతే. అయితే ప్రత్తిపాటి మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదట. తనను ప్రజలు ఓడించలేదని ఈయన చెప్పుకు తిరుగుతున్నాడట.
అదేంటి.. మంచి ఓట్ల ఆధిక్యతతో ఈయన మీద విడదల రజనీ గెలిచింది కదా, అంటే.. తన మీద గెలిచింది ఆమె కాదని, జగన్ మోహన్ రెడ్డి అని అంటున్నారట ప్రత్తిపాటి! చిలకలూరి పేటలో పోరాటం తనకూ- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి జరిగినట్టుగా చెబుతున్నారట ప్రత్తిపాటి!
ఇలా కాకిలెక్కలు చెబుతున్నారీయన. కేవలం విడదల రజనీ చేతిలో అయితే తను ఓడిపోయే అవకాశమే లేదని, అయితే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ జగన్ మోహన్ రెడ్డే పోటీ చేసినట్టుగా ప్రజలు తీర్పును ఇచ్చారని అందుకే తను ఓడిపోవడం జరిగిందని ఈ తెలుగుదేశం నేత చెప్పుకుంటున్నారట.
ఎలాగైతేనేం.. ఎన్నికల్లో ఓట్ల లెక్క ప్రకారం ఓడిపోయినట్టే కదా.. అంటున్నారు జనాలు. జగన్ పేరు చెప్పి తన ఓటమిని తక్కువ చేసి చూపించుకునేందుకే ఈయన ఈ అతి తెలివిని కనబరుస్తూ ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!