Begin typing your search above and press return to search.
జానీమూన్ కు పదవీగండం?
By: Tupaki Desk | 4 Jan 2017 9:28 AM GMTఏపీ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్ బాబుపై సంచలన విమర్శలు చేసిన గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జానీమూన్ కు పదవీ గండం ఉందా? అంటే జిల్లా అమాత్యులు - వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు చేసిన వ్యాఖ్యలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పుల్లారావు జెడ్పీ చైర్మన్ పదవి మార్పుపై టీడీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. జడ్ పి ఛైర్ పర్సన్ పదవి మార్పు విషయంలో ఎటువంటి ఒప్పందమూ లేదని గతంలో చెప్పిన పుల్లారావు ఇప్పుడు మాత్రం దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పటంతో జానీమూన్ కు పదవి గండం తప్పదని పలువురు పేర్కొంటున్నారు.
పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చిన్న నిర్ణయమైనా చంద్రబాబే తీసుకుంటారని, అవసరమైనప్పుడు తాము సలహాలు ఇస్తామని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు. సహచర మంత్రి రావెల కిశోర్ బాబుకు - జెడ్పీ చైర్మన్ కు జరిగిన వివాదం ముగిసిపోయిన అధ్యాయం అని తెలిపారు. అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఈనెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న అమరావతి మారథాన్‌లో అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో దీనిపై సిఎంతో మాట్లాడి నివారణ చర్యలు తీసుకుంటామని వివరించారు. మంత్రి పుల్లారావు వెంట జెడ్పీ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ - కలెక్టర్ కాంతిలాల్ దండే ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/