Begin typing your search above and press return to search.
అమరావతిలో మళ్లీ భూసేకరణ రచ్చ
By: Tupaki Desk | 28 Oct 2015 3:25 PM GMTనవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణకు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమైంది. భూసేకరణ కోసం నవంబర్ నెల తొలివారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. తుళ్లూరు మండలంలో 300 ఎకరాలకు ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. తొలిదశలో తుళ్లూరు మండలంలో 21 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రాజధానికి అవసరమైన మొత్తం భూమిని భూ సమీకరణ ద్వారానే సేకరించాలని భావించినప్పటికీ... కొందరు భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో భూ సేకరణ అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రజరాజధానికి భూములు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు ముందుకు వచ్చినా కొందరు కావాలనే రెచ్చగొట్టారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆక్షేపించారు. అలా భూ సమీకరణలో భూములు ఇవ్వని వారి కోసమే ఈ ప్రక్రియ అని చెప్పారు. 2013 భూసేకరణ చట్టం కింద ఏపీ సర్కార్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు ఇప్పటికైనా ముందుకు వస్తే భూ సమీకరణ కింద భూములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోమారు మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా ల్యాండ్ పూలింగ్ కింద 33,600 ఎకరాలు తీసుకున్నామని వివరించిన మంత్రి తొలివిడత భూ సేకరణ పూర్తయిన తర్వాత రెండో విడత ఉంటుందని తెలిపారు. రెండో విడతలో ఉండవల్లి - పెనుమాక - బేతపూడిలో 900 ఎకరాలు సేకరిస్తామన్నారు. 2,159 ఎకరాల భూములను, 1300 ఎకరాల అసైన్డ్, అటవీ భూములను భూసేకరణ కింద తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ఆంద్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష వైసీపీ - కాంగ్రెస్ - లెఫ్ట్ పార్టీలు - పలు సంఘాలు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భూసేకరణను వ్యతిరేకిస్తున్న సమయంలో ప్రభుత్వం తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారికంగా భూ సేకరణ ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.