Begin typing your search above and press return to search.
మరీ అంత అత్యాశ అవసరమా పత్తిపాటి?
By: Tupaki Desk | 28 Feb 2016 9:48 AM GMTఅందరి కంటే మెరుగ్గా ఉండాలనుకోవటం మంచిదే. దాన్ని అందరూ స్వాగతిస్తారు. కానీ.. తాము తప్ప మరెవరూ ఉండకూదన్న మాట ఎవరూ ఒప్పుకోరు.. అంగీకరించరు కూడా. దూకుడు రాజకీయాలు మొదలై నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థుల్ని భారీగా దెబ్బ తీయటం.. వారిని నిరాశ.. నిస్పృహలలో పడేసి వారి ఉనికే ప్రశ్నార్థకంగా మార్చాలన్న భావన ఈ మద్య ఎక్కువైంది.
అయితే.. అలాంటివి ఇప్పటివరకూ విజయవంతంగా పూర్తి అయ్యింది లేదు. తెలుగు నేల మీద కూడా అలాంటి తరహా రాజకీయాలు చేయాలని పలువురు భావించినా ఇప్పటివరకూ అవేమీ విజయవంతం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కూడా ఒక పద్దతి ప్రకారం.. వీలైనంత ఎక్కువగా విపక్షాల్ని దెబ్బ తీయాలన్న ఆలోచనే తప్పించి.. మొత్తంగా విపక్షాలు లేకుండా చేయాలన్న మాట గులాబీ నేతల నోటి రాలేదు.
కానీ.. అందుకు భిన్నమైన మాటల్ని ఏపీ అధికారపక్ష నేతలు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో రెండో విడత ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీలైనంత ఎక్కువ మంది విపక్ష నేతల్ని సైకిల్ ఎక్కించాలన్న పట్టుదలతో ఉన్నారు. అన్నింటికి మించి జగన్ కు కంచుకోట లాంటి కడప జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధినేతే స్వయంగా రంగంలోకి దిగటంతో కొందరు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
విపక్షం పని అయిపోయిందని.. వారిని క్లీన్ స్వీప్ చేసేస్తామంటూ బడాయి మాటలు చెబుతున్నారు. తాజాగా అలాంటి వ్యాఖ్యల్ని చేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లరావు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పలువురు తమ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని.. జగన్ పార్టీని టీడీపీలో విలీనం చేయటం మినహా మరో అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
తమ పార్టీలోకి వస్తున్న వారంతా స్వచ్ఛందంగా వస్తున్న వారే తప్పించి.. ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయటం లేదని చెబుతున్న పత్తిపాటి.. రాష్ట్రంలో విపక్షం అన్న మాట వినపడని రోజు త్వరలో వస్తుందన్న మాటను చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు. కానీ.. పత్తిపాటి లాంటి వాళ్లు మాత్రం అందుకు భిన్నంగా.. తాము తప్ప తమ ప్రత్యర్థులు ఎవరూ మిగలకూడదన్న రీతిలో మాట్లాడటం ఆందోళన కలిగించే విషయం. ప్రత్యర్థులపై పై చేయి సాధించాలని అనుకోవటం మంచిదే.. కానీ.. ప్రత్యర్థులన్న వాళ్లే ఉండకూడదనుకోవటం అత్యాశే అవుతుంది. ఆ విషయం పత్తిపాటికి ఎప్పటికి అర్థమవుతుందో..?