Begin typing your search above and press return to search.
ప్రత్తిపాటి పుల్లారావుకు పాత అనుచరురాలి చేతిలో ఓటమి తప్పదా?
By: Tupaki Desk | 3 May 2019 1:30 AM GMTరాజకీయాల్లో గురువులనే షాక్ కి గురిచేయడమన్నది కొత్తేమీ కాదు. ప్రస్తుత 2019 ఎన్నికల్లోనూ ఏపీలో ఇలాంటి గురుశిష్యుల పోటీ ఒకటుంది. ఈ పోటీలో శిష్యురాలు గురువు పై విజయం సాధించడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈ గురుశిష్యులెవరంటే... గురువు మంత్రి - టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కాగా.. శిష్యురాలు వైసీపీ నేత విడదల రజినీ.
అవును.. వీరిద్దరూ 2019 ఎన్నికలకు ముందు గురుశిష్యులే. ఎన్నికలకు ముందు వరకు విడదల రజినీ పుల్లారావుకు అనుచరురాలిగానే ఉండేవారు. ఆయన్ను చూసే రాజకీయాలు నేర్చుకున్న ఆమె ఆ తరువాత వైసీపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. అంతేకాదు.. గురువు పైనే పోటీకి దిగారు.
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకు గత ఎన్నికల వరకు తిరుగులేని ఆధిపత్యం ఉండేది. కానీ - ఇప్పుడు మాత్రం సీను రివర్సయిందట. ఈసారి ఆయన ఓటమి ఖాయమని టీడీపీ నేతల నుంచే వినిపిస్తోంది.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు 1999లో మంచి మెజారిటీతో గెలిచారు. కానీ, 2004లో ఆయన ఓడిపోయారు. ఆ ఓటమి తరువాత పుల్లారావు రాజకీయంగా బలపడ్డారు. గట్టి పునాదులు వేసుకున్నారు. దాంతో 2009 - 2014లో కూడా మంచి విజయాలు సాధించారు. అయితే.. 2019లో మాత్రం ఆయన ఆశలు తీరేలా లేవంటున్నారు.
కారణమేంటంటే... వైసీపీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో దూసుకుపోవడమే. ఎన్నికలకు కొద్దినెలల ముందు వరకు కూడా విడదల రజినీ పుల్లారావు వెంటే ఉన్నారు. కానీ.. జగన్ పాదయాత్ర గుంటూరుకు వచ్చేసరికి సీను మారిపోయింది. ఆమె వైసీపీలో చేరిపోయారు. అంతేకాదు.. చిలకలూరిపేట టిక్కెట్ సంపాదించుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో పుల్లారావు ఓటుకు రూ.3 వేలు చొప్పున పంచారట. కానీ, రజినీ మాత్రం పుల్లారావు, ఆయన భార్య చేసిన ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు రాబట్టుకున్నారని టీడీపీ నేతలనుంచే వినిపిస్తోంది. దీంతో రజినీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని వినిపిస్తోంది.