Begin typing your search above and press return to search.
ఈ కెలుక్కోవటం ఏంది ప్రత్తిపాటి
By: Tupaki Desk | 5 Sep 2016 10:57 AM GMTకొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి రాజకీయ కలకలం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఇష్యూను టేకప్ చేయటం.. భారీ కసరత్తు చేశాక ఇప్పుడున్న పది జిల్లాల స్థానే కొత్తగా 17 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. కొత్త జిల్లాల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఈ ఇష్యూ ఎంతగా రగులుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ అంశంపై తెలంగాణ విఫక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేక టీఆర్ ఎస్ నేతలు కిందామీదా పడుతున్నారు. చివరకు టీవీ ఛానళ్లలో నిర్వహించే లైవ్ చర్చల్లో సైతం టీఆర్ ఎస్ నేతలు తేలిపోతున్నారు. విపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నా.. అవన్ని కవరింగ్ అన్న విషయం అర్థమయ్యేలా ఉన్నాయన్న విమర్శ ఉంది. మరోవైపు కొత్త జిల్లాలపై అభ్యంతరాలు.. సూచనలు ఏమైనా ఉంటే చేయాలన్న పిలుపునకు దాదాపుగా 30 వేల వరకూ వచ్చిన పరిస్థితి. మరో 30 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఇంకెన్ని వేల ఫిర్యాదులు.. సూచనలు వస్తాయో అర్థం కాని పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు భారీగా వ్యయం కానున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పంచాయితీలన్నీ చూసిన తర్వాత చక్కగా సాగుతున్న విధానాన్ని డిస్ట్రబ్ చేస్తూ కేసీఆర్ తొందరపడ్డారా? అన్న సందేహం వ్యక్తం చేసే వారూ ఉన్నారు. తాజాగా ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పెదవి విప్పారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం లేదు.
అయినప్పటికీ.. ఆ విషయాన్ని ప్రత్తిపాటి టచ్ చేయటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న లొల్లిని ఓపక్క చూస్తూ ప్రత్తిపాటి అదే అంశంపై వ్యాఖ్యలు చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు లేనిపోని ఇష్యూలతో పాటు.. భారీ ఖర్చుతో కూడుకున్న విషయమన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి ముందస్తు ఆలోచనలు ఏమీ లేకుండానే కొత్త జిల్లాలంటూ చేసిన మంత్రి ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివి ఏమైనా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటోళ్లు వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.