Begin typing your search above and press return to search.
ఎన్నారైలకు ఈ వార్త... తీపి కబురే!
By: Tupaki Desk | 8 Jan 2017 4:27 AM GMTప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం నిజంగానే తీపి కబురు వినిపించింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు వేదికగా నిన్న ప్రవాస భారతీయ దివస్ ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రవాస భారత సంతతికి చెందిన పోర్చుగల్ ప్రధాని హెచ్ ఈ ఆంథోనియా కోస్టా హాజరుకానున్నారు. నిన్నటి ప్రారంభోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్ - విజయ్ గోయల్ - వీకే సింగ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన విజయ్ గోయల్... ప్రవాస భారతీయులకు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లలో ఎన్నారైలకు 15 శాతం లభిస్తోంది. ఈ శాతాన్ని మరింతగా పెంచే దిశగా తమ ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చల్లని కబురు చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రవాస భారతీయులు తమ విలువైన సలహాలు - సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఇక మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ప్రభుత్వ - ప్రైవేట్ రంగంలో 20 మేర ప్రపంచ స్థాయి కలిగిన యూనివర్సిటీల ఏర్పాటుకు కార్యరంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ ప్రభుత్వం నూతన పాలసీని త్వరలోనే ప్రకటిస్తుందని కూడా చెప్పారు.
ఈ 20 యూనివర్సిటీల్లో ఓ పది ప్రభుత్వ రంగంలో - మరో పది ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించి రూ.2 వేల కోట్లతో ఏర్పాటు కానున్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీకి కేంద్ర కేబినెట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ రీసెర్చి ఇనిషియేటివ్ నెట్ వర్క్ ప్రోగ్రాంతో పేరిట ప్రత్యేక పథకాన్ని త్వరలోనే ప్రకటించనున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ పథకం అమల్లోకి వస్తే... విదేశాల్లోని ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసేందుకు దేశీయ విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందనున్నాయని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/