Begin typing your search above and press return to search.
గులాబీ తెలంగాణను నీలి తెలంగాణగా మారుస్తారట.. ప్రవీణ్ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 6 Aug 2021 11:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోనుందా? ఇటీవల ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన.. యువ ఐపీఎస్ అధికారి, దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. వినూత్న రాజకీయాలకు తెరదీయనున్నారా? ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీకి చెక్ పెట్టేలా ఆయన వ్యవహరించనున్నారా? అంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నవారు.. ఔననే అంటున్నారు. అయితే.. పైన చెప్పుకొన్నవన్నీ.. సాధ్యాసాధ్యాలా? కావా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటికైతే.. ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు.. ఆయన దూకుడు మాత్రం దళిత సామాజిక వర్గంలో చర్చకు వస్తున్నాయి.
క్లారిటీ ఇదే..
ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై ప్రవీణ్ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ కావడం.. ముఖ్యంగా.. దళిత బంధుతో ప్రయోజనం లేదని వ్యాఖ్యానించడం వంటివి మేదావి వర్గాన్ని కూడా ఆకర్షిస్తున్నాయి. ఇక, ఆయన రాజీనామా తర్వాత ముందుగా అధికార పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో ఆయన అధికార పార్టీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఎక్కువగానే అందరినీ ఆకర్షించింది. ఇదిలావుంటే.. దీనిపై క్లారిటీ వచ్చేలోగానే.. ఆయనే ఓ స్వంత పార్టీ పెడతారని.. దీనికి సంబంధించి సన్నాహాలు కూడా చేస్తున్నారని.. ఓ ప్రచారం సాగింది.
అందరి పాటే..ప్రవీణ్ నోట!
అయితే ఇవన్నీ ఏమీ లేవని.. తాజాగా ఒక క్లారిటీ వచ్చేసింది. యూపీలో ఒకప్పుడు అధికారం చలాయించిన బహుజన సమాజ్ పార్టీ.. బీఎస్పీలో ప్రవీణ్ చేరనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి బీఎస్పీ అధినేత మాయావతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రవీణ్ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 8న నల్గొండ వేదికగా బీఎస్పీలో చేరుతున్నట్లుగా తెలిపారు. అయితే.. అందరిలాగానే ఈయన కూడా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే కావాలనో.. మంత్రి కావాలనో లేక పదవుల కోసమో.. బీఎస్పీలో చేరడం లేదన్నారు. కేవలం `గులాబీ తెలంగాణను నీలి తెలంగాణగా మార్చేందుకు` రాజకీయాల్లోకి వచ్చినట్టు సంచలన ప్రకటన చేశారు.
కేసీఆర్‌కు ప్రత్యర్థేనా?
తన విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని కామెంట్ చేశారు. ఇక, ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో ప్రత్యర్థి తెరమీదకు వచ్చాడనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం.
ఎంట్రీ అదిరేట్టు!
మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ ఎంట్రీ అదిరేలా కనిపిస్తోంది. ఆయన రాకను స్వాగతిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న(తక్కువ మందే అయినా) బీఎస్పీ నేతలు.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యాంగంను రక్షించడం కోసం ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. ప్రవీణ్ కుమార్ ఈ నెల 8 తేదీన పార్టీలో జాయిన్ అవుతున్నారని, ఆయన చేరిక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇందు కోసం నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మరి తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.