Begin typing your search above and press return to search.

దేశ‌మంతా ప‌ర్య‌టిస్తా..మోడీ వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తా

By:  Tupaki Desk   |   20 April 2018 5:00 AM GMT
దేశ‌మంతా ప‌ర్య‌టిస్తా..మోడీ వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తా
X
విశ్వహిందూపరిషత్ మాజీ నేత ప్రవీణ్ తొగాడియా సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. ఇటీవల జరిగిన వీహెచ్‌ పీ అంతర్జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో తనవర్గం నేత ఓటమిపాలైన నేపథ్యంలో వీహెచ్‌ పీని వీడుతున్నట్టు తొగాడియా ప్రకటించారు. అనంత‌రం ఆయ‌న దీక్ష‌కు సిద్ధ‌మైన ఆయ‌న గురువారం దీక్షను విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని పేర్కొన్నారు.

అయోధ్యలో రామమందిరం నిర్మించాలని - దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని - కశ్మీర్‌ లో హిందువులకు పునరావాసం కల్పించాలనే డిమాండ్లతో మంగళవారం అహ్మదాబాద్‌ లో తొగాడియా నిరవధిక దీక్ష చేపట్టారు. వైద్యులతోపాటు అఖిలేశ్వర్ దాస్ మహారాజ్ తదితర ఆధ్యాత్మికవేత్తలు దీక్ష విరమించాలని తొగాడియాను కోరారు. ఇందుకు సమ్మతించి ఆయన దీక్షను విరమించారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే ప్రధాన డిమాండ్‌ తో వంద కోట్ల హిందువుల సమస్యల కోసం శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. ముఖ్యంగా రైతులు - కార్మికుల - యువత సమస్యలను తన పర్యటనలో ప్రస్తావిస్తానని చెప్పారు. తనతో హిందువులు.. ఆరెస్సెస్ - బీజేపీ వీహెచ్‌ పీ ప్రతినిధులు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధాని మోడీ ఆ తర్వాత ప్రజాదరణ కోల్పోయారని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో వారు బుద్ధిచెప్తారని తెలిపారు.