Begin typing your search above and press return to search.
సంచలనం: మోడీపై వీహెచ్ పీ ఫైర్
By: Tupaki Desk | 12 July 2017 6:55 AM GMTజమ్మూకాశ్మీర్ లో తాజా చోటు చేసుకున్న ఉగ్రదాడి మరో సంచలనానికి తెర తీసింది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఉదంతంలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కొన్ని విపక్ష పార్టీలు మోడీ సర్కారు తీరును తప్పు పట్టాయి. అయితే.. అది పరిమితంగా మాత్రమే. అయితే.. ఊహించని రీతిలో బీజేపీకి దన్నుగా నిలిచే విశ్వహిందూ పరిషత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అమర్ నాథ్ యాత్రికుల మీద ఉగ్రవాదుల దాడి మోడీ సర్కారు అసమర్థతే కారణమని నిందించటం గమనార్హం. పవర్ లోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో మోడీ సర్కారు ఫెయిల్ అయ్యిందంటూ ఓపెన్ గానే విమర్శలు చేసేశారు విశ్వహిందూ పరిషత్ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఉగ్రవాదులు.. వారి సానుభూతిపరులపై చర్యలు తీసుకోవటానికి వీలుగా కాశ్మీర్ లోయను పూర్తిగా సైన్యం చేతికి అప్పగించాలంటూ పెద్ద పెద్ద సూచనలే చేస్తున్నారు.
అంతేకాదు.. రక్షణ మంత్రిగా బాధ్యతలు సమర్థుడైన నేతకు అప్పగించాలంటున్నారు. మోడీ సర్కారుపై తొగాడియా ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పక్షాలన్నీ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సర్కారు తీరును తప్పుపడితే.. అందుకు భిన్నంగా మిత్రుడిగా వ్యవహరించే వీహెచ్ పీ మాత్రం మోడీని నిందించటం విశేషమని చెప్పక తప్పదు.