Begin typing your search above and press return to search.

పీఆర్సీ ఎపిసోడ్: జనవరి 17 జీవోకు.. తాజా నిర్ణయానికి తేడా ఇదే

By:  Tupaki Desk   |   6 Feb 2022 6:30 AM GMT
పీఆర్సీ ఎపిసోడ్: జనవరి 17 జీవోకు.. తాజా నిర్ణయానికి తేడా ఇదే
X
ఏపీ ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు నడుమ చోటు చేసుకున్న పీఆర్సీ ఎపిసోడ్ ఎట్టకేలకు శుభం కార్డు పడ్డట్లే. దీంతో ఇరు వర్గాల మధ్య రగడ స్థానే.. సానుకూల వాతావరణం నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం రెండు అడుగులు వెనక్కి వేస్తే.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు (అందరూ కాదు కొందరు మాత్రమే) నాలుగు అడుగులు వెనక్కి వేశారు. దీంతో.. చర్చలు ఫలవంతమైనట్లు ప్రకటించే వీలు కలిగింది. అదే సమయంలో సమ్మె షాక్ నుంచి ప్రభుత్వం తప్పించుకునే అవకాశం కలిగింది. ఇంతకూ పీఆర్సీ రగడకు సంబంధించిన ఎపిసోడ్ ను చూస్త.. జనవరి 17న జగన్ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇంతకూ జనవరి 17న ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుకు.. శనివారం రాత్రి 10 గంటల వేళలో చర్చలు ఫలవంతంగా ముగిసినట్లుగా ప్రకటించిన వేళ.. తీసుకున్న నిర్ణయాలకు మధ్య తేడా ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మార్పుల్ని చూస్తే..

జనవరి 17 జీవోలో చెప్పింది తాజాగా చోటు చేసుకున్న మార్పు

1. ఫిట్ మెంట్ 23 శాతం ఎలాంటి మార్పు లేదు
2. ఐఆర్ 27% రికవరీ ఇదే శాతం 9 నెలలకు సంబంధించి రికవరీ ఉండదు
3. సీసీఏ పూర్తిగా తొలగింపు సీసీఏ పాతవి పునరుద్ధరిస్తారు
4. పదేళ్లకు ఒకసారి వేతన సవరణ కమిషన్ గతంలో మాదిరి 5 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ ఏర్పాటు
5. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్
6. మట్టి ఖర్చులకు గరిష్ఠంగా రూ.20వేలు మట్టి ఖర్చులకు గరిష్ఠంగా రూ.25 వేలు

పెన్షన్ కు సంబంధించి జనవరి 27కు ఇప్పటికి మధ్య కాస్త తేడా వచ్చింది. ఈ తేడాను చూస్తే..

జనవరి 27 ప్రకారం

- 80 ఏళ్ల నుంచి మూల పెన్షన్ పై 20 శాతం అదన- 85 ఏళ్ల నుంచి మూల పెన్షన్ పై 30 శాతం అదనం- 90 ఏళ్ల నుంచి మూల పెన్షన్ పై 40 శాతం అనం
- 95 ఏళ్ల నుంచి మూల పెన్షన్ పై 50 శాతం అదనం
- 100 ఏళ్ల నుంచి మూల పెన్షన్ పై 100 శాతం అదనం

తాజాగా నిర్ణయించింది చూస్తే..

- 70-74 ఏళ్ల వరకు మూల పెన్షన్ పై 7 శాతం
- 75-79 ఏళ్ల వరకు మూల పెన్షన్ పై 12 శాతం
- 80 ఏళ్ల నుంచి ఆ పైబడిన వారికి జనవరి 27లో నిర్ణయించిన విధానాన్ని అమలు చేస్తారు.

పీఆర్సీ రచ్చ ఎపిసోడ్ లో మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రెండింటి మీదనే ఎక్కువ చర్చ నడిచింది. అందులో మొదటిది ఫిట్ మెంట్ అయితే.. రెండోది హెచ్ఆర్ఏ. ఫిట్ మెంట్ మీద ప్రభుత్వం చెప్పినదే తప్పించి మార్పునకు నో అని చెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన అభ్యంతరాల్లో రెండోదిగా చెప్పే హెచ్ఆర్ఏ శ్లాబుల విషయంలో ప్రభుత్వం కాస్తంత వెనకడుగు వేసింది. అదెంత అన్నది చూస్తే..

జనవరి 17 జీవో ఏమేం చెప్పారంటే..

- 5 లక్షల లోపు జనాభా ఉంటే మూలవేతనంపైన 8 శాతం
- 5-50లక్షల జనాభా ఉంటే 16 శాతం
- 50 లక్షలకు పైగా జనాభా ఉంటే 24 శాతం
ఫిబ్రవరి 5 రాత్రి పూర్తైన చర్చల్లో తీసుకున్న నిర్ణయం ఏమంటే?
- 50 వేల లోపు జనాభా ఉంటే మూలవేతనంపై 10 శాతం లేదంటే గరిష్ఠంగా రూ.11వేలు
- 50 వేల నుంచి 2 లక్షల జనాభా వరకు మూల వేతనంపై 12 శాతం లేదంటే గరిష్టంగా 13 వేలు
- 2 లక్షల నుంచి 50 లక్షల వరకు మూల వేతనంపై 16 శాతం లేదంటే గరిష్ఠంగా రూ.17వేలు
- 50 లక్షలకు మించి జనాభా ఉంటే మూల వేతనంపై 24 శాతం.. గరిష్ఠంగా రూ.25వేలు

మొన్నటికి ఇప్పటికి వచ్చిన తేడా ఏంటి?

మొన్న విడుదల చేసిన జీవో మూడు కేటగిరిలు ఉంటే.. ఈసారి నాలుగు చేశారు. మొన్నటి దానిలో 5 లక్షల లోపు జనాభాను తీసుకోవటం వల్ల చిన్న చితకా గ్రామాలు మొదలు పట్టణాల్లో ఉండే వారికి ఒకేలాంటి హెచ్ ఆర్ ఏ వచ్చేది. అది కూడా 8 శాతం మాత్రమే. చర్చలు జరిగిన తర్వాత డిసైడ్ చేసింది చూస్తే.. 50 వేల లోపు జనాభా ఉంటే 10 శాతం (గతం కంటే 2 శాతం పెరిగింది).. ఈసారి గరిష్ఠం ఇచ్చారు. మొదటి దానిలో మూల వేతనంలో 8 శాతానికి ఇప్పుడు పెరిగిన 10 శాతం తీసుకుంటే 2 శాతం పెరిగినట్లైంది.

అంటే.. రూ.30 వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి మొదట్లో చెప్పిన దాని ప్రకారం 8 శాతంగా తీసుకుంటే.. రూ.2400 హెచ్ఆర్ఏగా వచ్చేది. తాజాగా డిసైడ్ దాని ప్రకారం రూ.3వేలుగా హెచ్ఆర్ఏగా రానుంది. మొన్నటి మార్పుతో పోలిస్తే.. తాజా మార్పుతో ఉద్యోగికి (రూ.30వేలు మూల వేతనంగా వచ్చే) రూ.600 పెరగనుంది.అదే సమయంలో జీతం ఎక్కువగా ఉన్నప్పటికీ గరిష్ఠంగా రూ.11వేలకు కటాఫ్ గా నిర్ణయించారు.

50-2 లక్షల జనాభా ఉండే ఊళ్లలో నివసించేవారు.. 2-50 లక్షల మధ్య జనాభా నివసించే పట్టణాల్లోని వారికి మాత్రం గతంతో పోలిస్తే.. కాస్తంత మెరుగైన హెచ్ ఆర్ఏ రానుంది. అయితే.. ఇది కూడా 5 లక్షల లోపు జనాభా నివసించే వారికి మాత్రమే ప్రయోజనం అంతకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగం చేసే వారికి గతంలో చెప్పినంతే ఇచ్చారు తప్పించి.. పెంచింది లేదు. 50 లక్షల జనాభాకు మించి ఉన్న నగరాల్లో ఉద్యోగం చేసే వారికి గతానికి.. ప్రస్తుతానికి మధ్య ఎలాంటి తేడా లేకపోవటం గమనార్హం.