Begin typing your search above and press return to search.
ఆ న్యూస్ ఛానల్ కర్ణాటక పోల్ సర్వే ఇదేనట!
By: Tupaki Desk | 8 May 2018 5:15 AM GMTమీడియా సంస్థలు చాలానే ఉంటాయి. కానీ.. కొన్నింటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంట ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఫలితం ఉండేదిలా అంటూ బోలెడంతమంది సర్వేలు నిర్వహించి ఫలితాల్ని వెల్లడిస్తుంటారు.
అయితే.. సర్వేలు నిర్వహించటం కూడా ఒక కళే. ప్రజాభిప్రాయాన్ని చెప్పటంలో ఎలాంటి త్రోటుపాటుకు గురి కాకుండా.. అంచనాల విషయంలో ఆచితూచి లెక్కలు చెప్పే సంస్థలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఏబీపీ ఉత్తరాది వారికి సుపరిచితమైన ఈ ఛానల్ పూర్తి పేరుకు వస్తే.. ఆనంద్ బజార్ పత్రిక. పేరుతో పత్రిక ఉన్నా.. ఇది ఛానలే. కాకుంటే మాతృసంస్థ పేపర్ కావటంతో దాంతోనే ఛానల్ కు పేరు పెట్టేశారు. ఉత్తరాదితో పాటు కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి సర్వేల్ని నిర్వహిస్తుంటుంది ఈ సంస్థ.
తెలుగు ప్రాంతానికి చెందిన మాజీ రాజకీయ నేత (రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మరీ.. సన్యాసాన్ని పాటిస్తున్న నేపథ్యంలో మాజీ అన్న మాట వాడాల్సి వచ్చింది) లగడపాటి రాజగోపాల్ సర్వేలు నిర్వహిస్తుంటారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఎన్నికల తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పటంతో ఆయనకో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
ఇంచుమించు ఇదే తరహా ఇమేజ్ ఎబీపీ ఛానల్‌కు ఉంది. ఆ ఛానల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై తన సర్వే రిపోర్ట్ ను వెల్లడించింది. ఈనెల 12న కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. 15న ఫలితాలు రానున్నాయి.
కర్ణాటక ఫలితం మీద ఆ ఛానల్ సర్వే చెప్పేదేమంటే.. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తేల్చింది. అధికార కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రాదని చెప్పింది. కర్ణాటకలో విజేతగా నిలిచేందుకు కిందామీదా పడుతున్న ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సీట్ల సాధన విషయంలో రెండోస్థానంలో నిలుస్తుందని.. కుమారస్వామికి చెందిన జేడీఎస్ మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొంది. కర్ణాటకలో హంగ్ పక్కా అని.. ప్రభుత్వ ఏర్పాటులో కుమారస్వామి కీ రోల్ పోషించనున్నట్లు తేల్చింది.
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 112 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గాల్సి ఉంటుంది. ఎబీపీ సర్వే ప్రకారం కాంగ్రెస్ 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుస్తుందని.. బీజేపీకి 84 సీట్లు వస్తాయని.. జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో హంగ్ ఖాయమని తేల్చింది. ఓట్ల శాతానికి వస్తే కాంగ్రెస్ 38 శాతం ఓట్లను రాబట్టుకుంటే.. బీజేపీ 33 శాతం.. జేడీఎస్ 22 శాతం ఓట్లు సొంతం చేసుకునే వీలుందని అంచనా వేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లు కర్ణాటకలో అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యమని 38 శాతం మంది అభిప్రాయపడితే.. బీజేపీతో 32 శతం.. జేడీఎస్ మీద 24 శాతం మంది నమ్మకాన్ని ఉంచారు. గ్రామీణ ఓటర్లలో 39 శాతం మంది కాంగ్రెస్ కు ఓటేస్తామని చెప్పగా.. 32 శాతం మంది బీజేపీకి.. 23 శాతం మంది జేడీఎస్‌కు ఓటు వేయసున్నట్లుగా చెప్పారని పేర్కొంది.
లింగాయత్ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇక.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాలన బాగుందని 43 శాతం మంది చెప్పగా.. ముఖ్యమంత్రి పదవికి ఆయనే సరిపోతారని 33 శాతం మంది చెబితే.. యాడ్యూరప్ప వైపు 27 శాతం మంది మొగ్గు చూపారు. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.