Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ సెంచరీ...కొత్త సర్వేలో క్లారిటీ
By: Tupaki Desk | 3 Dec 2018 4:57 PM GMTతెలంగాణలో అధికారంలోకి రావడంపై మరో సంచలన సర్వే వెలువడింది. అపద్ధర్మ సర్కారుకు సారథ్యం వహిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ దుమ్మురేపే రీతిలో గెలవబోతుందని తేలింది. దాదాపు 100 సీట్లతో టీఆర్ ఎస్ సర్కారు అధికారంలోకి రాబోతుందని ఓ సర్వే స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ చేసిన సర్వే ప్రకారం టీఆర్ ఎస్ పార్టీ సీట్ల సంఖ్య 100కు పైగా దాటింది. టీఆర్ ఎస్ పార్టీకి 94 నుంచి 104 వస్తాయని ఆ సర్వే తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి 16 నుంచి 21 సీట్లకే పరిమితం కానున్నట్లు పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 7 సీట్లు - బీజేపీకి 1 నుంచి రెండు సీట్లు - ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అభ్యర్థి - పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 2,86,567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు - గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్ ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్ ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురు లేదని సర్వే తేల్చి చెప్పింది.