Begin typing your search above and press return to search.

సర్వేల హోరు.. తెలంగాణలో గెలుపెవరిదంటే?

By:  Tupaki Desk   |   28 Nov 2018 8:51 AM GMT
సర్వేల హోరు.. తెలంగాణలో గెలుపెవరిదంటే?
X
తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? అంటే చెప్పడం కష్టం. అదే ఫ్లాష్ టీం సర్వే సంస్థలను అడిగినా - అడగకపోయినా ఇట్టే చెప్పేస్తారు. నిన్న వచ్చిన సర్వే రిపోర్టు ప్రకారం టీఆర్ ఎస్ అధికారం ఖాయం అని చెప్పగా - నేడు వచ్చిన సర్వే రిపోర్టు కూటమిదే అధికారం అని తేల్చేసింది. అసలు ఇదేలా సాధ్యం. ఓటర్ల నాడీని నిజంగా సర్వే టీంలు పట్టేస్తున్నాయా? అన్న ప్రశ్న రాకమానదు

తెలంగాణ ఎన్నికల వేళ అన్ని పార్టీలు విజయావకాశాలపై దృష్టి సారించాయి. ఫలానా వర్గం.. కులం ఫలానా నియోజకవర్గంలో ప్రభావం చూపుతుంది? అన్న అంశాలను సేకరించే పనిని పార్టీ నేతల కంటే.. ఫ్లాస్ టీం సర్వే సంస్థలు వేగంగా చేస్తున్నాయట... పలు జాతీయ ఛానళ్లతో పాటు - సంస్థల పేరుతో వస్తున్న సర్వేలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.

ఇండియా టుడే - ఎన్డీటీవీ - టీవీ5 - టైమ్స్ నౌ - పీఎస్ ఈ తదితర సర్వేల రిపోర్టులు అన్ని పార్టీలపై క్షేత్ర స్థాయిలో సర్వే చేశాయట. అన్ని సంస్థల సర్వేలు ఒకేలా ఉంటే ఇబ్బంది ఉండేదు కాదు.. ఒక్కో సంస్థ ఒక్కో పార్టీని కింగ్ మేకర్ ని చేసేశాయి. ఓ సంస్థ కేసీఆర్ అధికారం రావడం ఖాయమంటే.. మరో సంస్థ కూటమిదే అధికారం అంటూ సర్వే రిపోర్టుల్లో ప్రకటించేశారు.

సాధారణంగా పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీల హంగామా తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. టీఆర్ ఎస్ - మహా కూటమి మధ్యే పోటీ నెలకొని ఉండటంతో ఎవరు అధికారం చేపడతారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనిని అనుకూలంగా మలుచుకునేందుకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలను - సొంత పార్టీ నేతలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని అనుకూల సర్వేలను చేయించుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా పార్టీల గెలుపోటములపైనే కాకుండా - ముఖ్య నేతలపైనా కూడా బెట్టింగ్ లు కాసేస్తున్నారు.

అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో ఫేస్ బుక్ - వాట్సప్ - యూట్యూబ్.. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు సర్వే చేస్తున్న సంస్థల రిపోర్టులు ఓటింగ్ సరళిపై ప్రభావం చూపుతాయో లేదా?, ఏది నిజమైనదో తెలుసుకోవాంటే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.