Begin typing your search above and press return to search.

ప్రీ పోల్స్ సర్వే: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో మళ్లీ బీజేపీదే!

By:  Tupaki Desk   |   10 Nov 2022 7:20 AM GMT
ప్రీ పోల్స్ సర్వే: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో మళ్లీ బీజేపీదే!
X
దేశ ప్రజల మూడ్ తెలుస్తోంది. మరో ఏడాదిన్నర మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు టైం ఉంది. దీనికి ముందు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారన్న విషయాన్ని తేల్చిచెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారిదే వచ్చే సారి అధికారం అని స్పష్టమవుతోంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఈ రెండు రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ విజయం సాధించి తన పట్టు నిలుపుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటరు నాడిని స్పష్టం చేస్తాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

గుజరాత్ లో రెండు విడతలుగా.. హిమాచల్ ప్రదేశ్ లో ఓకే విడతలో ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈక్రమంలోనే అక్కడ గెలుపు ఎవరిదన్న దానిపై ప్రీ పోల్స్ నిర్వహించారు. కొన్ని సర్వేలు ఆసక్తికర ఫలితాలను ప్రకటించాయి.

ఈ సర్వేలలో దాదాపు ఎక్కువ శాతం సర్వేలు బీజేపీ వైపు ముగ్గుచూపడం విశేసం. తాజాగా రిపబ్లికన్ టీవీ ప్రీ మార్క్యూ పోల్ సర్వేలో గుజరాత్ లో బీజేపీ మూడింట రెండు వంతుల విజయాన్ని అంచనవేసింది. మొత్తం 182 స్తానాలలో 127 నుంచి 140 వరకూ బీజేపీకి వస్తాయని పేర్కొంది. 46.2 ఓటు శాతం బీజేపీకి వస్తుందని అంచనావేసింది. కాంగ్రెస్ కు 28.4 శాతం ఓట్లతో 35-45 సీట్లు, ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి 20.6 శాతం ఓట్లతో 9-21 సీట్లు గెలుచుకోగలదని అంచనావేసింది. ఇప్పటివరకూ వెల్లడించిన ఇతర సర్వేలు .. ఇతరులు రెండు స్థానాలను గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు భిన్నంగా మూడు స్థానాల వరకూ ఇతరులకు వస్తాయని అంచనావేస్తున్నారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీనే మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. 68మంది సభ్యులు అసెంబ్లీలో బీజేపీకి 37-45 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం బీజేపీ 45.2 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉండనుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 22-28 సీట్లతో 40.1 ఓటింగ్ శాతంతో రెండో స్థానంలో నిలుస్తుందని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందని.. 5.2 శాతం ఓటు షేర్ ఉంటుందని అంచనావేశారు. ఇతరులకు 1-4 సీట్లు రావచ్చని పేర్కొంది.

మొత్తంగా మరోసారి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కమల వికాసమే ఉండనుందని అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.