Begin typing your search above and press return to search.

జగన్ సంచలనం... ఏపీ సర్కారీ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ

By:  Tupaki Desk   |   19 May 2020 2:45 PM GMT
జగన్ సంచలనం... ఏపీ సర్కారీ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ
X
ప్రీ ప్రైమరీ... ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న విద్యా విధానం. నర్సరీ, ఎల్ కేజీ (లోయర్ కిండర్ గార్డెన్), యూకేజీ (అప్పర్ కిండర్ గార్డెన్) పేరిట కొనసాగుతున్న ప్రీ ప్రైమరీలో పాఠశాలకు పిల్లలు అలవాటు పడటం, కొంతమేర ప్రాథమిక విద్యపై పిల్లలకు అవగాహన కలగడం, మొత్తంగా 1వ తరగతిలో చేరేందుకు పిల్లలను పూర్తిగా సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెద్ద కసరత్తే జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా దేశంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ అన్న మాటే వినపడబదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్... ఏపీలో ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన 3 వేలకు పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జగన్ సర్కారు ప్రీ ప్రైమరీ విద్యా వ్యవస్థను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది.

దేశంలోనే తొట్ట తొలిసారిగా సర్కారీ బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసేసుకున్న జగన్ సర్కారు... అందుకు సరిపడ కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవస్థను దిగ్విజయంగా ప్రారంభించేందుకు కూడా సన్నద్ధమైపోయింది. ఏపీ సర్కారీ బడుల్లో జగన్ సర్కారు ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ విద్యకు సంబంధించిన వివరాలు ఏమిటన్న విషయానికి వస్తే... ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరే ఇప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను నిర్వహిస్తారు. 3 నుంచి 5 ఏళ్ల వయస్సున్న పిల్లలను వారి వయసును బట్టి ఈ మూడు తరగతుల్లోకి అనుమతిస్తారు. మొత్తం 3,400 ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరహా విద్యా విధానాన్ని అమలు చేస్తారు. ఈ తరగతులత కోసం కాంట్రాక్ట్ పద్దతిన ఉపాధ్యాయులను నియమిస్తారు.

ఇదిలా ఉంటే... కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యేందుకు సమయం ఆసన్నమైన వేళ... సర్కారా బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని ప్రారంభించడం సాద్యమవుతుందా? అన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్న వేళ.. జగన్ సర్కారు ఈ విషయంలో చాలా క్లారిటీతోనే ఉన్నట్లుగా కనిపిస్తోందని చెప్పాలి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అయిపోయిన జగన్ సర్కారు... ప్రీ ప్రైమరీ వ్యవస్థను కూడా కొత్తగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరాన్ని ఆగస్టు నెల 3 నుంచి ప్రారంభించనున్నట్లుగా ప్రకటించేసింది. అంటే అటు ఆంగ్ల మాధ్యమంతో పాటు ఇటు ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని ప్రారంభించేందుకు కూడా అనువుగా విద్యా సంవత్సరాన్ని రెండు నెలల పాటు వాయిదా వేసిందన్న మాట. దీనిపై ఎలాంటి విమర్శలు రేకెత్తకుండా.. కరోనా కారణంగా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను జగన్ సర్కారు ఇందుకు అనువుగా మార్చుకుందని చెప్పక తప్పదు