Begin typing your search above and press return to search.
కుప్పంలో టీడీపీ ముందు జాగ్రత్త చర్యలు షురూ!
By: Tupaki Desk | 20 Nov 2022 1:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ మంచి ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్ల అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును సైతం ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అందులోనూ 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తమ నేతలకు పెద్ద లక్ష్యాన్నే పెట్టారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అప్రమత్తమైంది. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓటర్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విస్తృతంగా జియో ట్యాగింగ్ చేయడంతోపాటు ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, కుప్పం, గుడుపల్లె, రామకుప్పం మండలాల్లో సుమారు 75 వేల కుటుంబాలు ఉండగా పార్టీ శ్రేణులు యుద్ధప్రాతిపదికన ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు జియో ట్యాగింగ్ చేపడుతున్నారు.
కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 2,18,933 మంది ఓటర్లు ఉండగా, ఓటరు జాబితాల్లోని వివరాలు, నివాస గృహాల్లోని ఓటర్లు, సంబంధిత కుటుంబాల వివరాలను çపరిశీలిస్తున్నారు. తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయిలో ఓటర్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
ఓటర్ల వివరాల నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను సైతం రూపొందించడం విశేషం. పంచాయతీ, గ్రామ స్థాయిలో చురుకైన నాయకులు, కార్యకర్తలు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓటర్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
ఆయా కుటుంబాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారా? వేరే చోట ఉంటున్నారా? వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఏ చిన్న తప్పుకూ అవకాశం ఇవ్వకూడదనే రీతిలో ఈ కసరత్తును ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, మండల ఇన్‌ఛార్జ్‌లు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు ప్రత్యేక దృష్టి సారించి ఓటర్లు, కుటుంబాల వివరాల నమోదులో చురుగ్గా పాల్గొంటున్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.