Begin typing your search above and press return to search.

ట్రంప్ త‌ప్పించే జాబితాలో అమెరిక‌న్లు

By:  Tupaki Desk   |   12 March 2017 5:47 AM GMT
ట్రంప్ త‌ప్పించే జాబితాలో అమెరిక‌న్లు
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న టీంను మరింత బ‌లోపేతం చేసే దిశగా నిర్ణ‌యం తీసుకున్నారు. తాజా మాజీ అధ్యక్షుడు బ‌రాక్‌ ఒబామా హయాంలో నియమితులైనవారు రాజీనామా చేయాల్సిందిగా ట్రంప్ స‌ర్కారు కోరింది. ఈ ఆదేశాల ప్ర‌కారం ప్రముఖ ఇండో అమెరికన్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారాతోపాటు మొత్తం 46 మంది అటార్నీలను వైదొలగాల్సి ఉంది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నియ‌మితులైన వారిని ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ట్రంప్ ప్రభుత్వం కోరింది నిజ‌మేన‌ని ఆ దేశ న్యాయశాఖ ప్రతినిధి సారా ఇస్గర్ ఫ్లోర్స్ తెలిపారు.

కాగా, ప్రతివారం నిర్వహించే రేడియో - వెబ్ ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒబామాకేర్ స్థానంలో తమ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఆరోగ్య ప్రణాళికకు మద్దతునివ్వాలని .. చట్టసభ సభ్యులను కోరారు. ఏడేళ్ల‌ కిందట ఒబామాకేర్‌ ను ప్రతిపాదిస్తూ చెప్పిన హామీలేవీ సాకారం కాలేదని విమర్శించారు. ఒక కుటుంబానికి ప్రీమియంను 2500 డాలర్లకు తగ్గిస్తామని చెప్పారని, కానీ అది 4500 డాలర్లను దాటిపోయిందని ఆయన ఆరోపించారు. అయిన‌ప్ప‌టికీ పెద్దగా ప్ర‌యోజ‌నం ఏమీ కల‌గ‌లేదు కాబ‌ట్టే తాము నూత‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ట్రంప్ వివరించారు. కొత్త బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/