Begin typing your search above and press return to search.

బిడ్డ పుట్టే వరకు ప్రెగ్నెన్సీ తెలియదు.. ఏకంగా విమానంలో డెలివరీ..!

By:  Tupaki Desk   |   15 Dec 2022 9:30 AM GMT
బిడ్డ పుట్టే వరకు ప్రెగ్నెన్సీ తెలియదు.. ఏకంగా విమానంలో  డెలివరీ..!
X
ప్రపంచంలో అరుదుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇక కొందరైతే పుట్టుకతోనే అద్భుతాలను సృష్టిస్తూ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తమ వైపుకు ఆకర్షించుకుంటారు. పుట్టి పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్న చందంగా కొందరు భూమిపైకి వచ్చిన రోజు వండర్స్ క్రియేట్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.

తాజాగా ఇలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన బిడ్డకు జన్మించేంత వరకు కూడా ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం కూడా తెలియదట. విమానంలో ప్రయాణిస్తున్న ఆ మహిళకు సడెన్ గా కడుపులో నొప్పి రావడంతో వాష్ రూమ్ కు వెళ్లింది.

ఈ నేపథ్యంలోనే నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సహాయం అందించగా వాష్ రూమ్ లో నే బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమర అనే మహిళ ఈక్విడార్ నుంచి స్పెయిన్ కు విమానంలో వెళుతోంది. విమానంలో గాలిలో ఉన్న ఉండగానే తమరకు కడుపులో నొప్పిగా అనిపించింది. దీంతో వాష్ రూమ్ కు వెళ్లింది. వైద్యులు ఆమెకు కడుపు నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ అందించారు.

ఈ సమయంలో తమర ఏకంగా డెలివరీ అయింది. వాష్ రూమ్ లోనే బిడ్డను జన్మనిచ్చింది. దీంతో డెలివరీ తర్వాత చేయాల్సిన పనులన్నింటిని వైద్యులు చేశారు. అయితే తమరకు ప్రెగెన్నీ వచ్చిన విషయం బిడ్డ పుట్టే వరకు కూడా తెలియదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తల్లి.. బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

విమానం ల్యాండ్ కాగానే తల్లి బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఇలాంటి మిరాకిల్స్ తరుచూ వెలుగు చూస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఏది ఏమైనా తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో ప్రతీఒక్కరూ ఆ మహిళకు కంగ్రాట్స్ చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.