Begin typing your search above and press return to search.

మ‌రికొద్ది సేప‌ట్లో తాళి క‌ట్టించుకోవాలి.. ఇంత‌లో పురుటి నొప్పులు.. ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 AM GMT
మ‌రికొద్ది సేప‌ట్లో తాళి క‌ట్టించుకోవాలి.. ఇంత‌లో పురుటి నొప్పులు.. ఏం జ‌రిగింది?
X
వారిద్దరూ తమ వివాహ కార్యక్రమం కలకాలం గుర్తుండేలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఏర్పాట్లు కూడా ఆర్భాటంగా చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా మంటపానికి చేరుకున్నారు. వివాహ క్రతువు చివరి అంకానికి చేరుకుంది. అయితే అకస్మాత్తుగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వధువుకు పురిటినొప్పులు మొద‌ల‌య్యాయి. దీంతో ఆమె పెళ్లి పీట‌ల‌పైనే విల‌విల్లాడిపోయింది.

దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యం అర్థం కాక‌.. పెళ్లి వేడుక‌కు వ‌చ్చిన బంధువులు, మిత్రులు త‌ల ప‌ట్టుకున్నారు. చేసేది లేక‌, స‌ద‌రు వ‌ధువును మూడుముడులు ప‌డ‌కుండానే, వివాహ క్ర‌తువును మ‌ధ్య‌లో ఆపేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? త‌ర్వాత ఏం జ‌రిగింది? అస‌లు పెళ్లి అయిందా? వ‌రుడు ఏమ‌న్నాడు..? ఆయ‌న త‌ర‌ఫు బంధువులు ఏం చేశారు? అనేది ఆస‌క్తిక‌రం

సాధార‌ణంగా ఇలాంటి ఘ‌ట‌న మ‌న దేశంలో అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. వ‌ధువు, వ‌రుడు ఇద్ద‌రూ ప్రేమికులు అయిన‌ప్ప‌టికీ.. ముందుగానే సెక్స్ సంబందం పెట్టుకున్నా.. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న‌కు తార‌స‌ప‌డ‌లేదు. కానీ, ఇది నెద‌ర్లాండ్స్‌లో జ‌రిగింది. ఇక్క‌డ వ‌ధువు, వ‌రుడు వివాహానికి ముందుగానే ప్రేమ‌లో ప‌డ్డారు. దీంతో వీరి ప్రేమ‌ను మన్నించిన ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీక‌రించాయి. అయితే, అప్ప‌టికే ప‌దే ప‌దే సెక్స్‌లో పాల్గొన్న ఈ ఇద్ద‌రు.. `నియంత్ర‌ణ` పాటించ‌లేదు. దీంతో వివాహ వేడుక స‌మ‌యానికే వ‌ధువుకు నొప్పులు వ‌చ్చాయి.

నెదర్లాండ్స్‌లోని డోడ్రెచ్ట్ పరిధిలో ఈ ఘటన ఎల్ల‌లు దాటి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. డోడ్రెచ్ట్ ప్రాంతానికి చెందిన‌ నికోల్, మార్క్‌లు ప్రేమికులు. దీంతో వీరి బంధువులు వీరి ప్రేమ‌ను అంగీక‌రించి అక్టోబర్ 26న వివాహం చేయాల‌ని ఏర్పాటు చేశారు. వివాహ కార్యక్రమం కలకాలం గుర్తుండేలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఏర్పాట్లు కూడా ఆర్భాటంగా చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా మంటపానికి చేరుకున్నారు. పెళ్లి వేడుక జరుగుతుండగా.. అకస్మాత్తుగా వధువు పురిటినొప్పులతో విలవిలలాడిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటపంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బంధువులు అయోమయంలో ఉండగా, వరుడు మాత్రం సంతోషంగా కనిపించాడు. వివాహానికి ముందే వధువు గర్భిణిగా ఉంది. అయితే డెలివరీ సమయానికి ముందే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.

కానీ గడువు తేదీ కంటే 5వారాల ముందే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత అదే ఆస్పత్రిలోని ఓ గదిలో వివాహ ఏర్పాట్లు చేశారు. వివాహ కార్యక్రమం పూర్తవడంతో బంధువులంతా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అధికారులు.. ఇది అరుదైన వివాహమంటూ కితాబిచ్చారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.