Begin typing your search above and press return to search.

యేటా పెరుగుతున్న ప్రెగ్నెన్సీ టూరిజం.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   26 Dec 2022 10:38 AM GMT
యేటా పెరుగుతున్న ప్రెగ్నెన్సీ టూరిజం.. ఎక్కడంటే?
X
గర్భం దాల్చేందుకు భారత్ కు వచ్చే విదేశీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రెగ్నెన్సీ టూరిజంగా విదేశీయులు పిలుచుకుంటున్న ఈ తతంగం వెనుక పెద్ద కథే ఉంది. మేం ఆరుల్యం అందుకే విదేశీయులు మా పొందు కోరుకొని గర్భం దాల్చేందుకు ఇష్టపడుతారంటూ లద్దాఖ్ లోని ఓ సమూహం గర్వంగా చెబుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. లద్దాఖ్‌లో సింధూ నది ఒడ్డున ఉండే బియామా.. దాహ్.. హానూ.. దార్చిక్ గ్రామాలకు చెందిన సుమారు 5వేల బ్రోక్పా జాతి ప్రజలు తమను తాము చిట్టచివరి 'స్వచ్ఛమైన ఆర్యులు'గా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అన్ని గ్రామాలకు చేరుకోవడంతో బ్రోక్పా జాతి ప్రజల గురించి ఇంటర్నెట్లో వెతికే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది.

బ్రోక్పా ప్రజలు భారత్ లోని లద్దాక్ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకుంటున్న విదేశీయులు వీరితో సంభోగం జరిపి గర్భం దాల్చేందుకు ఇష్టపడుతున్నారు. వీరి ద్వారా ప్రెగ్నెన్సీ చేయించుకొని తిరిగి తమ దేశానికి వెళుతున్నారు. ఇదే విషయాన్ని 2007లో సంజీవ్ శివన్ తీసిన 'ది ఆచ్టంగ్ బేబీ... ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ' అనే డాక్యుమెంటరీలో వివరించారు.

ఇందులో ఓ జర్మనీకి చెందిన ఓ యువతి లద్దాఖ్ వచ్చి.. ఇక్కడి వ్యక్తి సాయంతో గర్భం దాల్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని వారు ఇదే విషయాన్ని చెబుతుండటం గమనార్హం. అయితే ఈ విషయాన్ని అందరితో పంచుకోవడానికి బోక్పా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే దీని వల్ల ఎక్కడ తమ జాతికి చెడ్డపేరు వస్తుందోనని భయపడుతున్నారు.

కాగా బాతాలిక్ గ్రామానికి చెందిన ఓ దుకాణదారుడు మాత్రం ఈ విషయంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'కొన్నేళ్ల క్రితం జర్మనీకి చెందిన ఓ మహిళతో తాను లేహ్ లోని హోటళ్లలో చాలా రోజులు గడిపానని.. ఆమె గర్భం దాల్చాకే ఇక్కడి నుంచి వెళ్లిపోయిదని తెలిపాడు. ఆ మహిళ కొన్నేళ్ల తర్వాత పుట్టిన బిడ్డను తీసుకొని నన్ను కలవడానికి వచ్చిందని వివరించాడు.

ఇకపోతే బ్రోక్పా ప్రజలంతా మిగతా లద్దాఖ్ వాసులతో పోలిస్తే విభిన్నంగా ఉంటారు. బియామా.. గార్కొనే దార్చిక్ దాహ్.. హానూ లాంటి గ్రామాల్లోని ప్రజలు చాలా పొడుగ్గా చూడటానికి అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఆర్యులనేలా కన్పిస్తారు. లద్దాఖ్ వాసులతో పొలిస్తే తమ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయని ల్వామో అనే బ్రోక్పా యువతి తెలిపింది.

మేము కూడా ఆర్యుల మాదిరిగానే ప్రకృతిని ఆరాధిస్తాం.. మా సంస్కృతి వైదిక సంస్కృతితో ముడిపడి ఉంటుందని ఆమె వెల్లడించింది. మా భాషపై కూడా సంస్కృతం ప్రభావం ఉంటుందని తెలిపిది. మేం సూర్యుడిని సూర్య్ అని.. గుర్రాన్ని అశ్వ్ అంటామని వివరించింది. మేం దేవి దేవతలను పూజిస్తామని ల్వామో తెలిపింది.

చరిత్రకారుల సైతం బ్రోక్పా ప్రజలపై అనేక పరిశోధనలు చేసి వీరంతా ఆర్యులేనని తేల్చి చెప్పారు. ఎహెచ్.ఫ్రెంకీ అనే చరిత్రకారుడు హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ టిబెట్ అనే పుస్తకంలో దర్ద్ అనే ప్రాంతాన్ని ఆర్యన్ స్టాక్ గా అభివర్ణించారు. ఇంకా చాలా మంది రచయితలు కూడా తమను అలెగ్జాండర్ ద గ్రేట్ వారసులని గుర్తించారని పేర్కొన్నారు. ఈ కారణంగానే యేటా ఆ ప్రాంతంలో ప్రెగ్నెన్సీ కోసం వచ్చే విదేశీ మహిళల సంఖ్య పెరిగిపోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.