Begin typing your search above and press return to search.
లైవ్ లో పాడుతున్న సింగర్ ను కాల్చేశారు
By: Tupaki Desk | 12 April 2018 5:34 AM GMTఇటీవల కాలంలో భారత్ కు సంబంధించిన అంశాలపై పాక్ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి సంగతి పట్టని వారు.. భారత్ మీద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లో చోటు చేసుకున్న దారుణ ఘటన గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
పాక్ లోని సింధ్ ప్రావిన్సు పరిధిలోని కంగా గ్రామంలో పాక్ ప్రముఖ గాయని 24 ఏళ్ల సమీనా సామూన్ నిండు గర్భిణిని క్రూరంగా చంపేసిన వైనం సంచలనంగా మారింది. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటంటే.. ఒక కార్యక్రమంలో పాటలు పాడటానికి వచ్చిన ఆమె.. నిలుచొని కాకుండా కూర్చొని పాటలు పాడటమే.
కూర్చొని పాడుతున్న ఆమెను.. తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి నిలబడి పాడాలని కోరాడు. అతడి మాటల్ని వినలేదన్న కోపంతో సింగర్ మీద కాల్పులు జరిపాడు. నిండు గర్భవతి అయిన ఆమె తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తేల్చారు.
తన భార్యను.. ఆమె గర్భంలోని శిశువును హతమార్చిన నిందితుడిపై జంట హత్యల కేసు నమోదు చేయాలని సింగర్ భర్త డిమాండ్ చేశాడు. సమీనా హత్యకు సంబంధించిన వీడియోక్లిప్ ను మానవ హక్కుల సంఘం ప్రతినిధి కపిల్ దేవ్ ట్విట్టరో లో పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ గా మారింది. ప్రముఖ సింగర్ ను కాల్చి చంపిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.