Begin typing your search above and press return to search.

వేట కొడవలితో గర్భిణి హత్య.. హైదరాబాద్ లో దారుణం

By:  Tupaki Desk   |   14 Sep 2022 12:45 PM GMT
వేట కొడవలితో గర్భిణి హత్య.. హైదరాబాద్ లో దారుణం
X
సమాజంలో దయ, ప్రేమ , మానవత్వం సన్నగిల్లుతోంది. క్షణికావేశంలో హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. విచక్షణ మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. ఆస్తి కోసం.. ప్రేమ కోసం.. పగ, ప్రతీకారాలతో ప్రాణాలు తీస్తున్నారు. మానవ మృగాలుగా మారి తోటి మనిషి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిండు గర్భిణిని ఆమె ఆడపడుచు భర్త అమానుషంగా హత్య చేసిన వైనం మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వి. వెంకట రామకృష్ణ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్రవంతి, కూతురు చైత్ర ఉన్నారు. ప్రస్తుతం స్రవంతి 8 నెలల నిండు గర్భిణి. 2020లో తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీప్రసన్నకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కావూరు శ్రీరామకృష్ణతో పెళ్లి జరిపించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉన్నారు.

శ్రీరామకృష్ణ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో లక్ష్మీప్రసన్న పుట్టింటికి వచ్చేసింది. అనంతరం లక్ష్మీప్రసన్న హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటోంది. భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లక్ష్మీప్రసన్న కేసు పెట్టడం వెనుక వెంకటరామకృష్ణ దంపతులు ఉన్నారని శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లను హత్య చేయాలని స్కెచ్ గీశాడు.

సెప్టెంబర్ 6న వెంకటరామకృష్ణ ఇంటికి శ్రీరామకృష్ణ వెళ్లాడు. అప్పుడు తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు అతడు బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతిని చంపేందుకు శ్రీరామకృష్ణ నిర్ణయించాడు. ఆమె కేకలు వేస్తూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా..వేట కొడవలితో అతి కిరాతకంగా నరికాడు. బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ స్రవంతి చనిపోయింది. సెప్టెంబర్ 7న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.